మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటివలే చరణ్ ఆ సినిమా షూటింగ్ కోసం అమృత్ సర్ వెళ్ళాడు. అక్కడ మూడు రోజుల పాటు సాంగ్ షూట్ లో పాల్గొన్నాడు. ఆ సాంగ్ లో ఓ చిన్న పాత్ర కోసం ఇక్కడి నుండి కమెడియన్ సత్య కూడా అమృత్ సర్ వెళ్ళాడు. చిత్రీకరణ కోసం సత్య అక్కడే మూడు రోజులు ఉండిపోయాడు. అయితే చివరి రోజు చరణ్ అక్కడి నుండి బయలుదేరుతుండగా సత్య ఎదురై మెగా పవర్ స్టార్ తో మాట్లాడాడు. మాటల మధ్యలో వెళ్ళిపోతున్నారా ? అన్నట్టుగా సత్య అడిగే సరికి వెంటనే చరణ్ నువ్వు కూడా నాతో వచ్చేయ్ అంటూ సొంత విమానంలోకి స్వాగతం పలికాడు.
దీంతో కమెడియన్ సత్య షాకయ్యాడు. సత్య మెగాస్టార్ కి వీరాభిమాని. చరణ్ అంటే కూడా చాలా ఇష్టం. ఇదంతా చరణ్ కి బాగా తెలుసు. అందుకే చరణ్ ఉన్నపళంగా సత్యని సొంత ఫ్లయిట్ లోకి వెల్కం చెప్పి తనతో హైదరాబాద్ వరకూ ట్రావెల్ చేసి సత్య కి ఎప్పటికీ మర్చిపోలేని ఓ బెస్ట్ మెమొరీ ఇచ్చాడు. రామ్ చరణ్ ఇలా కమెడియన్ ని సొంత ఫ్లయిట్ లో తీసుకోచ్చేసరికి యూనిట్ కూడా షాకయ్యారట.
ఒకప్పుడు మెగా స్టార్ చిరు కూడా కమెడియన్ గా అప్పుడప్పుడే ఎదుగుతున్న బ్రహ్మానందంని హైదరాబాద్ నుండి చెన్నై కి ఫ్లయిట్ లో తీసుకెళ్ళారు. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా బ్రహ్మినే చెప్పుకున్నాడు. ఇప్పుడు తండ్రిలానే చరణ్ కూడా తోటి నటులతో ప్రేమగా మెలుగుతూ వారికి ఫేవరేట్ హీరో అనిపించుకుంటున్నాడు.
RC15 సాంగ్ కి సంబంధించి అమృత్ సర్ లో మూడు రోజులు షూట్ చేశారు. హైదరాబాద్ లో మిగతా సాంగ్ షూట్ నాలుగు రోజుల పాటు జరగనుంది.
This post was last modified on July 7, 2022 4:31 pm
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…