Movie News

ప్రభాస్ కి టివీలోనూ చేదు అనుభవమే

బాహుబలి ఫ్రాంచైజీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడన్న సంగతి తెలిసిందే. అక్కడి నుండి వరుస ఫ్లాపులు అందుకుంటూ తన ఇమేజ్ ని తగ్గించేసుకున్తున్నాడు ప్రభాస్.
బాహుబలి 2 తర్వాత వచ్చిన ‘సాహో’ , రాదే శ్యామ్ సినిమాలు నిరాశ పరిచి ఫ్లాప్ అనిపించుకున్నాయి. ‘సాహో’ నార్త్ లో ఓ మోస్తరు కలెక్షన్స్ తో సేఫ్ అనిపించుకుంది. కానీ రాధేశ్యామ్ నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.

తాజాగా ఈ సినిమా బుల్లితెరపై కూడా డిజాస్టర్ అనిపించుకుంది. పోయిన ఆదివారం ఈ సినిమా జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యింది. జీ సంస్థ కొన్ని గ్రౌండ్ ఈవెంట్స్ లాంటివి కూడా చేసి బాగానే ప్రమోట్ చేశారు. ప్రభాస్ కి భారీ క్రేజ్ ఉండే భీమవరంలో రాధేశ్యామ్ థీమ్ పార్క్ అనే కాన్సెప్ట్ తో ప్రమోట్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఒకచోట చేరి అందరూ సినిమా చూడాల్సిందే అంటూ గ్రూపులు కట్టారు. దీంతో ఈ సినిమా టెలివిజన్ లో మంచి రేటింగ్ దక్కించుకోవడం అనుకున్నారు అంతా.

కానీ ఇప్పుడు రేటింగ్ చూస్తే రివర్స్ లో ఉంది. తొలిసారి బుల్లితెరపై రాధేశ్యామ్ కి దక్కిన టీ ఆర్ పి కేవలం 8.25 . నిజానికి ఇది చాలా తక్కువే. గతంలో ఇదే చానెల్ లో టెలికాస్ట్ అయిన ‘వకీల్ సాబ్’ 19 పైనే టి ఆర్ పి అందుకుంది. బంగార్రాజు కూడా 14 పైనే స్కోర్ చేసింది.

ప్రభాస్ ‘సాహో’ కి కూడా టివీలో ఇలాంటి ఫలితమే వచ్చింది. ఆ సినిమాకు గానూ 5.81 టిఆర్పి వచ్చింది. అప్పట్లో అదే టైంలో ఈటీవీలో ప్రసారమైన ‘గుణ 369’ 5.9 టిఆర్పి వచ్చింది. అంటే కుర్ర హీరో కార్తికేయ సినిమా కంటే ప్రభాస్ సినిమాకు రేటింగ్ తక్కువ రావడం అప్పట్లో చర్చనియంశం అయ్యింది.

దాన్ని ఆ సినిమా టీం ఛానెల్ వారు బాగా మార్కెట్ చేసుకొని ప్రభాస్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టారు. మరి ఇప్పుడు ‘రాధేశ్యామ్’ కి కూడా తక్కువ రేటింగే దక్కింది. నాగార్జున కంటే ప్రభాస్ సినిమా టిఆర్పి తక్కువ రావడం నమ్మలేకుండా ఉంది. మరి టివీలో ప్రభాస్ ఇమేజ్ తగ్గిపోతుందా ? లేదా ఫ్లాప్ సినిమాలు చూడటానికి ఇష్టపడటం లేదా ? ప్రభాస్ అండ్ టీం ఒకసారి అనాలసిస్ చేసుకోవాల్సిందే.

This post was last modified on July 7, 2022 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ బిగ్ బ్రేక్ ఇచ్చేసిన రాజమౌళి..

మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…

33 mins ago

ఐపీఎల్ వేలంలో 13 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ వైభవ్?

ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…

42 mins ago

మండ‌లిని ఇలా బ‌లోపేతం చేస్తున్నారు.. బాబు ఐడియా భేష్ ..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఐడియా వేస్తే.. తిరుగుండ‌దు. అది ఎన్నిక‌లైనా.. రాజ‌కీయాలైనా పాల‌న‌లో అయినా.. ఆయ‌న ఆలోచ‌న‌లు…

1 hour ago

గేమ్ ఛేంజర్ మీద ఒత్తిడి షురూ

పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…

2 hours ago

‘పుష్ప-2’ ఈవెంట్లో రభస రభస

‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా.…

3 hours ago