యువ దర్శకుడు మారుతి ఇప్పటిదాకా చాలా వరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాలే చేశాడు. ‘భలే భలే మగాడివోయ్’తో భారీ విజయాన్నందుకున్నాక అతను ఎక్కువగా ఆ రేంజ్ సినిమాలే తీస్తూ వచ్చాడు. పెద్ద హీరోల్లో ఒక్క విక్టరీ వెంకటేష్ మాత్రమే మారుతిని నమ్మి అవకాశం ఇచ్చాడు. కానీ వీరి కలయికలో వచ్చిన ‘బాబు బంగారం’ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత మిడ్ రేంజ్ హీరోలకే పరిమితం అయ్యాడు మారుతి.
తాజాగా గోపీచంద్‌తో అతను జత కట్టాడు. కానీ వీరి కలయికలో వచ్చిన ‘పక్కా కమర్షియల్’ తుస్సుమనిపించింది. ఈ సినిమా విడుదల కాకముందే మారుతికి ఇద్దరు టాప్ హీరోలు ఆఫర్ ఇచ్చారు. అందులో ఒకరు ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అనదగ్గ ప్రభాస్ కాగా.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి. ప్రభాస్‌తో మారుతి సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతుండగా..‘పక్కా కమర్షియల్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో స్వయంగా చిరంజీవే తాను మారుతితో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.
ఐతే ఇలా ఇద్దరు బిగ్ స్టార్స్ మారుతితో సినిమా చేయడానికి ముందుకు రావడం బాగానే ఉంది కానీ.. ఆ హీరోల అభిమానులు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. మారుతితో సినిమా చేయడం గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ముందు నుంచే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా.. ‘పక్కా కమర్షియల్’ రిలీజయ్యాక వాళ్లు మరింతగా మొండికేస్తున్నారు. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్.. తన స్థాయికి తగని సుజిత్, రాధాకృష్ణలతో సినిమాలు చేసి ఇప్పటికే తల బొప్పి కట్టించుకున్నాడని.. అవి చాలవన్నట్లు ఇప్పుడు మారుతితో సినిమా అవసరమా అని వాల్లు ప్రశ్నిస్తున్నారు.
ఇక ‘పక్కా కమర్షియల్’ ఈవెంట్లో మారుతితో సినిమా గురించి చిరు ప్రస్తావించినపుడు మెగా ఫ్యాన్స్ మౌనం వహించారు కానీ.. ఈ సినిమా రిలీజయ్యాక వాళ్లు కూడా గగ్గోలు పెడుతున్నారు. చిరంజీవి లైనప్ విషయంలో ఇప్పటికే వాళ్లు అసంతృప్తితో ఉన్నారు. మెహర్ రమేష్ లాంటి దర్శకుడిని నమ్మి ‘బోళా శంకర్’ చేయడాన్ని తప్పుబడుతున్నారు. మిగతా సినిమాల విషయంలోనూ వారికి అభ్యంతరాలున్నాయి. అందులోనూ ‘ఆచార్య’తో డిజాస్టర్ ఎదుర్కొన్నాక అయినా చిరు జాగ్రత్త పడకుండా ఫాంలో లేని మారుతితో సినిమా చేయడం ఏంటని.. ఇలాంటి మొహమాటాలు పక్కన పెట్టి త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులతో సినిమా చేసేందుకు ప్రయత్నించాలని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on July 7, 2022 1:24 pm
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…