Movie News

రెండు డిజాస్టర్లిచ్చినా ఇంకో ఛాన్స్


హీరోయిన్లకు కెరీర్ ఆరంభంలో వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే ఐరెన్ లెగ్ ముద్ర వేసి సాగనంపేస్తారు. ఈ ముద్రను తొలగించుకుని కొంతమంది హీరోయిన్లే నిలబడగలుగుతారు. సౌత్‌లో అలాంటి హీరోయిన్లలో శ్రుతి హాసన్ ఒకరు. పూజా హెగ్డేది సైతం ఇలాంటి ప్రయాణమే. తమిళంలో ఆమె తొలి చిత్రం ‘మాస్క్’ పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత తెలుగులో చేసిన ముకుంద, ఒక లైలా కోసం కూడా సరిగా ఆడలేదు. హిందీలో ఏమో ‘మొహెంజదారో’ లాంటి ఆల్ టైం డిజాస్టర్‌తో ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఈ స్థితిలో పూజ కెరీర్ ముందుకు సాగదనే అంతా అనుకున్నారు.

కానీ ‘దువ్వాడ జగన్నాథం’తో రీఎంట్రీ ఇచ్చి గ్లామర్ విందు చేయడంతో కుర్రకారుకు ఆమె బాగా నచ్చేసింది. ఆ సినిమా కూడా అనుకున్నంతగా ఆడకపోయినా.. పూజ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆపై తెలుగులో ఆమె పెద్ద పెద్ద సినిమాలు చేసి ఘనవిజయాలందుకోవడం తెలిసిందే. టాలీవుడ్లోనే కాక బాలీవుడ్లోనూ ఆమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి.

ఐతే తాను హీరోయిన్‌గా పరిచయం అయిన కోలీవుడ్లో జెండా పాతాలని పూజ కోరుకుంది. ఈ క్రమంలో ఆమెకు ఓ భారీ చిత్రంతో అక్కడ రీఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. అదే.. విజయ్ హీరోగా నటించిన ‘బీస్ట్’. ఈ సినిమా రిలీజ్‌కు ముందు పూజా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా చూస్తే ‘బీస్ట్’ డిజాస్టర్ అయింది. అందులో ఆమె పాత్రకు అసలు ప్రాధాన్యం కూడా లేకపోయింది. తమిళంలో చేసిన రెండో సినిమా కూడా డిజాస్టర్ కావడంతో పూజకు అక్కడ ఇక కష్టమే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకో పెద్ద సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కడం విశేషం.

కోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సూర్యతో ఆమె జత కట్టబోతోంది. ప్రస్తుతం వెట్రిమారన్, బాలా సినిమాల్లో నటిస్తున్న సూర్య.. దీని తర్వాత మాస్ డైరెక్టర్ శివతో ఓ చిత్రం చేయబోతున్నాడు. అజిత్‌తో వీరం, వేదాళం, విశ్వాసం లాంటి పెద్ద హిట్లిచ్చిన దర్శకుడతను. చివరగా రజినీతో అతను తీసిన ‘అన్నాత్తె’ అంచనాలను అందుకోలేకపోయింది. అతను సూర్య కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా పూజ కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. మరి కోలీవుడ్లో మూడో సినిమా అయినా ఆమె కోరుకున్న విజయాన్నిస్తుందేమో చూడాలి.

This post was last modified on July 6, 2022 2:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్… ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయ!

ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…

47 minutes ago

మ‌నిషి వైసీపీలో – మ‌న‌సు కూట‌మిలో..!

రాష్ట్రంలోని ఒక్కొక్క‌ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…

2 hours ago

జైల్లో ఉన్న హీరోకు థియేటర్ విడుదల

స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…

2 hours ago

తమ్మినేని తనయుడి పొలిటికల్ పాట్లు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…

3 hours ago

దురంధర్ మీద రాళ్ళూ పూలూ విసురుతున్నారు

మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…

3 hours ago

ఎన్నో ట్విస్టులతో… డ్రీమ్ లవ్ స్టోరీకి బ్రేకప్

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…

6 hours ago