మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్లో మంచి పేరున్న కథానాయికే. కెరీర్ ఆరంభంలోనే హృతిక్ రోషన్‌తో ‘సూపర్ 30’ లాంటి పెద్ద సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హోమ్లీ లుక్స్‌తో ఉండే మృణాల్ చాలా వరకు ట్రెడిషనల్, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేసింది. కానీ ఆమె గ్లామర్ విందు చేయడానికి ఆమె సిద్ధమే అని ఈ మధ్యే బాలీవుడ్ జనాలకు అర్థమవుతోంది.
ధమాకా, జెర్సీ లాంటి చిత్రాల్లో నటనతో ఆకట్టుకుంటూనే ఆమె గ్లామర్ విందు కూడా చేసింది. హాట్ హాట్ సీన్లలో నటించింది. బయట ఆమె చేసే ఫొటో షూట్లు కూడా హాట్ హాట్‌గా ఉంటున్నాయి. బాలీవుడ్లో కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్న మృణాల్‌కు తెలుగులో అవకాశం వచ్చింది. మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరున్న హను రాఘవపూడి కళ్లు ఆమెపై పడ్డాయి. తన కొత్త చిత్రం ‘సీతారామం’లో సీత పాత్రకు మృణాల్‌నే ఎంచుకున్నాడతను.
ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ అయినప్పటి నుంచి మృణాల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక సినిమాలోని రెండు పాటలు చూశాక మృణాల్ మరింతగా నచ్చేస్తోంది. తాజాగా రిలీజైన ‘ఇంతందం’ పాటలో అయితే ఆమె లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ కట్టి పడేస్తున్నాయి. ఈ సినిమా ఎలా ఆడుతుందో ఏమో కానీ మృణాల్ మాత్రం మాయ చేయబోతోందని స్పష్టమవుతోంది. దుల్కర్ లాంటి మంచి పెర్ఫామర్‌కు దీటుగానే మృణాల్ కనిపించేలా ఉంది. వాళ్లిద్దరి కెమిస్ట్రీనే సినిమాకు బలంగా నిలిచేలా ఉంది.
తెలుగులో ఇప్పుడు స్టార్ హీరోల పక్కన నటించే కథానాయికల విషయంలో కొరత ఉంది. కాజల్, సమంత, తమన్నా, రకుల్ ప్రీత్‌ల జోరు తగ్గిపోయింది. అందరూ పూజా హెగ్డే, రష్మికల వెంటే పడుతున్నారు. వాళ్లనే రిపీట్ చేయాల్సి వస్తోంది. అడిగిన సినిమాలన్నింటికీ వాళ్లు ఓకే చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి టైంలో కొత్త ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అందం, అభినయం రెండూ ఉన్న మృణాల్‌కు స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కావాల్సిందల్లా తొలి చిత్రం హిట్టవడం, ఆమెకు పేరు రావడం. ‘సీతారామం’ ఆ మ్యాజిక్ చేస్తుందనే అనిపిస్తోంది.
This post was last modified on July 6, 2022 2:50 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…