పుష్ప విలన్ విచిత్రమైన పరిస్థితి

మలయాళంలో గొప్ప విలక్షణ నటుల్లో ఒకరిగా పేరున్న ఫహద్ ఫాసిల్ మనకు పుష్పతో విలన్ గా పరిచయమయ్యాడు కానీ తను కేరళలో నాని రేంజ్ ఉన్న స్టార్ హీరో. సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే కరోనా ప్రభావం వల్ల పాపం ఇప్పుడో విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాడు. ఫహద్ సోలో హీరోగా రిలీజైన చివరి థియేట్రికల్ మూవీ 2020లో వచ్చిన ట్రాన్స్.ఇది కేరళలో సక్సెస్ ఫుల్ మూవీగా రికార్డులు నమోదు చేసుకుంది. ఆ తర్వాత కావాలని చేయకపోయినా వరసగా నాలుగు సినిమాలు డైరెక్ట్ ఓటిటి రూటు పట్టాయి.

సీయూ సూన్, ఇరుల్, జోజి, మాలిక్ ఇవన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నవే. కొన్ని భాషలకు రీమేక్ హక్కులు కూడా అమ్మేశారు. డైరెక్ట్ డిజిటల్ కు ఇవ్వడం వల్ల సుమారు వంద కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ ని పోగొట్టాడని ఫాసిల్ మీద అక్కడి డిస్ట్రిబ్యూటర్లు గత కొంత కాలంగా గుర్రుగా ఉన్నారు. ఇప్పుడివి చాలదన్నట్టు నెక్స్ట్ మూవీ మలయన్ కుంజుని కూడా ఓటిటికే ఇచ్చేశారు. అంటే బ్యాక్ టు బ్యాక్ అయిదన్న మాట. ఫాసిల్ బిగ్ స్క్రీన్ మీద కనిపించింది పుష్ప, విక్రమ్ లో మాత్రమే. వాటిలో బన్నీ, కమల్ హాసన్ లు హీరోలు.

దెబ్బకు ఫాహద్ మీద ఎగ్జిబిటర్లలో వ్యతిరేకత పెరుగుతోంది. ఇకపై అతని సినిమాలు కొనమని నిర్ణయం తీసుకోవాలన్నా వేరే హీరోల కాంబినేషన్ లోనూ నటిస్తుండటంతో మింగలేక కక్కలేక అలాగే భరిస్తున్నారు. మొత్తానికి ఓటిటి స్టార్ గా మారిపోయిన ఫహద్ ఫాసిల్ ఇవేవీ పట్టించుకోవడం లేదు. నెక్స్ట్ చేయబోయే పుష్ప 2 ది రూల్ కోసం రెడీ అవుతున్నాడు. సెకండ్ పార్ట్ లో తన పాత్రే కీలకం కావడంతో దర్శకుడు సుకుమార్ ఎక్కువ కాల్ షీట్స్ అడిగారట. మూడు భాషల్లో బిజీగా ఉన్న ఆర్టిస్టుల్లో ఫహద్ టాప్ లో ఉన్నాడు