తవ్వి తీయాలే కానీ పాత తెలుగు సాహిత్యంలో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి. రొటీన్ సినిమాలతో విసుగెత్తిపోతున్న ప్రేక్షకులను థియేటర్ దాకా రప్పించే మంత్రదండం వాటిలో ఉందనే కొత్త తరం దర్శకులు క్రమంగా పెరుగుతున్నారు. దీన్ని మొదటగా అందిపుచ్చుకున్నది దర్శకుడు క్రిష్.
ఆ మధ్య మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి తొమ్మిది గంటల నవలను నైన్ అవర్స్ పేరుతో హాట్ స్టార్ కోసం వెబ్ సిరీస్ గా తీయిస్తే దానికి మంచి పేరే వచ్చింది. క్రిష్ డైరెక్షన్ చేయకపోయినా రచనతో సహా నిర్మాణ వ్యవహారాలన్నీ ఆయనవే.
ఇప్పుడు మరో వెబ్ సిరీస్ కోసం ఆయనే నేరుగా రంగంలోకి దిగనుండటం హాట్ టాపిక్ గా మారింది. సుప్రసిద్ధ నాటకం కన్యాశుల్కంని ఓటిటిలో తీసుకొస్తారట. ఇందులో అతి కీలకమైన వేశ్య మధురవాణి పాత్రను యాంకర్ అనసూయతో చేయించేందుకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టుగా తెలిసింది.
నిజానికి వేదంలో అనుష్క క్యారెక్టర్ ని డిజైన్ చేసింది ఈ ప్రభావంతోనే. ఇప్పుడు నేరుగా ఒరిజినల్ స్టైల్ లో చూపించబోతున్నారు. గురజాడ అప్పారావుగారు రచించిన ఈ నాటకం మీద అన్న ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా కూడా ఉంది.
ఇప్పటి కాలానికి ఈ కన్యాశుల్కం కాన్సెప్ట్ ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూస్తే కానీ చెప్పలేం. అసలే ఆడియన్స్ అభిరుచులు విభిన్నంగా మారుతున్నాయి. ఎప్పుడో జరిగినవి చరిత్ర మర్చిపోయినవి చూపిస్తామంటే అంతగా ఆసక్తి కనబర్చడం లేదు.
ఈ కారణంగానే నక్సలిజం బ్యాక్ డ్రాప్ మూవీస్ దారుణంగా దెబ్బ తింటున్నాయి. వాటితో కన్యాశుల్కంని పోల్చలేం కానీ మొత్తానికి రిస్క్ అయితే ఉంది. దూరదర్శన్ ఛానల్ లో ఒకప్పుడు సక్సెస్ ఫుల్ గా సీరియల్ వచ్చింది. మరి క్రిష్ ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…