సహజంగానే హీరోయిన్స్ మీద గాసిప్స్ , రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఏ మాత్రం రెస్పాండ్ అవ్వకపోయినా కట్టుకథలను నిజం చేసేస్తారు నెజిజన్లు. తాజాగా ఇలాంటి ఓ రూమర్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని చుట్టుకుంది. కన్ఫర్మ్ అన్నట్టుగా చక్కర్లు కొట్టింది. దీంతో లావణ్య మీడియా ముందుకొచ్చి రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. మేటర్ ఏంటంటే… మొన్నీ మధ్య లావణ్య మెగా హీరో వరుణ్ తేజ్ తో డేటింగ్ చేస్తుందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది.
తాజాగా హ్యాపీ బర్త్ డే ప్రమోషన్స్ లో లావణ్య ని లవ్ మ్యారేజ్ న్యూస్ గురించి సదరు రిపోర్టర్ ప్రశ్నించాడు. ఇందులో నిజమెంత ? అని అడిగాడు. దాంతో లావణ్య కాసేపు తన నోటీస్ కి అలాంటి న్యూస్ ఏం రాలేదన్నట్టుగా ప్రవర్తించి ఫైనల్ గా అవన్నీ రూమర్లె అంటూ తిప్పికొట్టింది. చివర్లో ఈ రింగ్ కూడా నాదే ఎవ్వరూ ఇవ్వలేదు. నేనే కొనుక్కున్నా అంటూ క్లారిటీ ఇచ్చింది. వరుణ్ తేజ్ తో కలిసి లావణ్య ‘మిస్టర్’ అనే సినిమాలో నటించింది. అప్పటి నుండి వీరిద్దరూ స్నేహంగా మెలుగుతున్నారు. అదే ఈ రూమర్ కి దారి తీసి ఉండొచ్చు.
అంటే తన చేతికున్న రింగ్ చూసి ఎవరైనా ఇంకో ప్రశ్న అడిగే లోపే తనే జాగ్రత్త పడి ఈ కుర్ర హీరోయిన్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ వార్తలపై లావణ్య కూల్ గానే రెస్పాండయింది. ఈ న్యూస్ కి చెక్ పెట్టేసింది. మరి వరుణ్ తేజ్ ఈ రూమర్స్ పై ఎలా స్పందిస్తాడో ?
This post was last modified on July 6, 2022 11:52 am
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…