Movie News

సుశాంత్ కేసులో కొత్త మలుపు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడి రెండు వారాలు దాటిపోయింది. అతడిది ఆత్మహత్యే అని తేల్చినప్పటికీ.. అతను అంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్యకు ప్రధానంగా ప్రేమ వ్యవహారం కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. అతడి జీవితంలో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలున్నారు. ఒకప్పుడు అంకిత లోఖండెతో సీరియస్‌గా కొన్నేళ్ల పాటు రిలేషన్‌షిప్ నడిపాడు సుశాంత్. కారణాలేంటో తెలియవు కానీ ఆమె నుంచి విడిపోయాడు. సుశాంత్ ఎంతో సంతోషంగా ఉన్న రిలేషన్‌షిప్ ఇదే అంటారు. తర్వాత కృతి సనన్‌తో కొన్నాళ్లు ప్రేమలో ఉన్నాడంటారు కానీ.. దానిపై స్పష్టత లేదు. ఆమెతో అతను ‘రాబ్తా’ అనే సినిమా చేసినంత కాలమే ఇలాంటి వార్తలు వినిపించాయి.

ఐతే తర్వాత రియా చక్రవర్తితో మాత్రం సుశాంత్ సీరియస్‌గానే ప్రేమాయణం నడిపాడని.. వాళ్లిద్దరూ ఈ ఏడాది అక్టోబరులో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని.. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. రియాను పోలీసులు కొన్ని రోజుల పాటు విచారించడం కూడా తెలిసిందే. ఐతే ఆ విచారణ సందర్భంగా రియా దాచిపెట్టిన ఓ విషయాన్ని పోలీసులు తమ విచారణలో కనుగొన్నట్లు తెలుస్తోంది. రియా సోదరుడు షఓవిక్ చక్రవర్తితో కలిసి సుశాంత్ వ్యాపారం చేస్తున్నాడట. ‘వివద్రేజ్ రియాలిటిక్స్’ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఫిర్మ్ ఏర్పాటు చేసి వీళ్లిద్దరూ వ్యాపారం నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విషయాన్ని తన స్టేట్మెంట్‌లో రియా వెల్లడించకపోవడంతో సుశాంత్ ఆత్మహత్య వెనుక ఈ వ్యాపార సంబంధిత విషయాలేమైనా ఉన్నాయేమో అన్న అనుమానంతో పోలీసులు షోవిక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట.

This post was last modified on June 30, 2020 11:11 am

Share
Show comments
Published by
suman

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago