నందమూరి కళ్యాణ్ రామ్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. తన మార్కెట్ స్థాయికి మించిన బడ్జెట్లతో సాహసాలు చేయడం అతడికి కొత్తేమీ కాదు. ‘బింబిసార’తో కూడా అలాంటి సాహసానికే పూనుకున్నాడు. వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడిని నమ్మి భారీ బడ్జెట్లో ‘బింబిసార’ సినిమాను నిర్మించాడు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఆషామాషీగా ఏమీ తీయలేదని.. బాగా ఖర్చు పెట్టి రాజీ లేకుండా ఈ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మించాడని ట్రైలర్ చూస్త స్పష్టమైంది.
విజువల్స్, సెట్టింగ్స్, గ్రాఫిక్స్.. అన్నింట్లోనూ ఒక స్థాయి కనిపించింది. కాకపోతే పటాస్, 118 తప్పితే గత దశాబ్దంన్నర కాలంలో హిట్లే లేని కళ్యాణ్ రామ్.. ఏ నమ్మకంతో ఇంత భారీ సినిమాలు చేయగలుగుతున్నాడన్నది ప్రశ్న. అందులోనూ ఈ మధ్య సినిమాల థియేట్రికల్ బిజినెస్ చాలా దెబ్బ తినేసింది. ప్రేక్షకులకు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం తగ్గిపోయింది.
ఇలాంటి సమయంలో మార్కెట్ బాగా దెబ్బ తిన్న కళ్యాణ్ రామ్ లాంటి హీరో పెద్ద బడ్జెట్లో ‘బింబిసార’ లాంటి ఒక సినిమా చేయడమే ఆశ్చర్యం అంటే.. దీన్నొక ఫ్రాంఛైజీలా మారుస్తామని, ఈ సినిమాకు కొనసాగింపుగా ఇంకో మూడు చిత్రాలు వస్తాయని చెబుతుండటం విశేషం. ‘బింబిసార-2’కు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని, వచ్చే ఏడాది ఆగస్టు 23న రెండో భాగం రిలీజవుతుందని కళ్యాణ్ రామ్ ప్రకటన చేయడం గమనార్హం. కుదిరితే తర్వాతి భాగాల్లో తన తమ్ముడు ఎన్టీఆర్ కూడా నటిస్తాడని కళ్యాణ్ రామ్ పేర్కొనడం నందమూరి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించేదే.
ఐతే ముందు ఆగస్టు 5న విడుదల కాబోతున్న ‘బింబిసార’ను ప్రేక్షకులు ఆదరించాలి. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం రావాలి. అప్పుడే సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేటవుతుంది. ఆర్థికంగా అది వర్కవుట్ అవుతుంది అనిపిస్తేనే సినిమా చేస్తారు. ఆ తర్వాత 3, 4 భాగాల గురించి ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి ‘బింబిసార’కు హైప్ తీసుకురావడానికే ఫ్రాంఛైజీ, నాలుగు భాగాలు అని కళ్యాణ్ రామ్ మాట్లాడినట్లు కనిపిస్తోంది.
This post was last modified on July 5, 2022 3:08 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…