కోలీవుడ్ అభిమానులు ప్రేమతో మక్కల్ సెల్వన్ అని పిలుచుకునే విజయ్ సేతుపతి పాత్రల పరంగా ఎలాంటి పరిమితులు విధించుకోకుండా కాంబినేషన్ నచ్చితే ఏ క్యారెక్టర్ వచ్చినా కాల్ షీట్స్ ఉంటే చాలు చేసేస్తున్నాడు. ఉప్పెన, విక్రమ్, మాస్టర్ లలో విలన్ గా చూపించిన విశ్వరూపం తన ఫ్యాన్ బేస్ ని పెంచేసింది. అయితే హీరోగా ఫెయిలవుతున్న విజయ్ సేతుపతికి ఇప్పుడీ కెరీరే బాగున్నట్టు అనిపిస్తోంది. అందుకే దర్శకులు సైతం దుర్మార్గంగా చూపించే అలాంటి నెగటివ్ వేషాలతోనే తనను సంప్రదిస్తున్నారు.
తాజాగా షారుఖ్ ఖాన్ తో ఆట్లీ రూపొందిస్తున్న జవాన్ లో విలన్ గా విజయ్ సేతుపతినే ఎంచుకున్నట్టు చెన్నై టాక్. ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని బాద్షా ఫైనల్ గా ఓకే చెప్పాక అఫీషియల్ గా ప్రకటిస్తారట. ఈ సినిమాలో ఇంతకు ముందు బాలీవుడ్ ఎన్నడూ చూడని అతి క్రూరమైన విలనీని ఆట్లీ రాసుకున్నాడట. దానికి ఆషామాషీ నటులైతే న్యాయం చేయలేరని భావించి మక్కల్ సెల్వన్ ను అడిగారు. చిరంజీవి కోసమని సైరాలో చిన్న క్యామియో చేసిన విజయ్ సేతుపతి ఇప్పుడీ ఆఫర్ ని వద్దనే ఛాన్స్ ఎంత మాత్రం లేదు.
పుష్ప 2 లోనూ తన కోసం దర్శకుడు సుకుమార్ ఒక ప్రత్యేకమైన ట్రాక్ రాసుకున్నారని ఇప్పటికే మైత్రి కాంపౌండ్ నుంచి లీకయిన న్యూస్. మొదటి భాగంలోనే అనుకున్నప్పటికీ కాల్ షీట్స్ సమస్య రావడంతో ఆ స్థానంలో ఫహద్ ఫాసిల్ వచ్చి ఆ లోటుని అద్భుతంగా పూరించాడు. ఇప్పుడు తనకు తోడుగా విక్రమ్ తరహాలో ఈ ఇద్దరి కాంబోని సెట్ చేస్తే అల్లు అర్జున్ తో ఢీ కొట్టే ఎపిసోడ్స్ కెజిఎఫ్ రేంజ్ లో వస్తాయని సుక్కు భావించినట్టు తెలిసింది. ఈ రెండూ ఓకే అయితే విజయ్ సేతుపతి ఫ్యాన్స్ పక్కా డబుల్ బొనాంజానే.
This post was last modified on July 5, 2022 1:24 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…