బాలకృష్ణను మినహాయిస్తే నెక్స్ట్ తరంలో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి వంశం నుంచి అంతో ఇంతో చెప్పుకోదగ్గ సినిమాలు చేస్తున్న హీరో కళ్యాణ్ రామ్ ఒక్కడే. కాకపోతే విజయం ఇతనితో దోబూచులాడుతూనే ఉంటుంది. ఒక హిట్టు వచ్చి కెరీర్ పైకెళ్తోందని ఆనందించే లోపే రెండు మూడు ఫ్లాపులు వచ్చి మార్కెట్ ని తగ్గిస్తాయి. దానికి తోడు ఆయా చిత్రాల నిర్మాణంలో జరిగే జాప్యం వల్ల ఏడాదికి రెండు మూడు సినిమాలు వచ్చేలా చేసుకోవాల్సిన ప్లానింగ్ లోనూ తారక్ అన్నయ్య తడబడుతున్నాడు. అదనంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద చూసుకుంటున్న స్వంత ప్రొడక్షన్ వ్యవహారాలు ఉండనే ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఎంత మంచివాడవురా వచ్చిన రెండేళ్ల తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసారతో వస్తున్నాడు. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. నిన్నటి దాకా పెద్దగా హైప్ లేదు కానీ ఈ వీడియో చూశాక మాత్రం అంచనాలు వచ్చేలానే ఉన్నాయి. కాకపోతే నేపథ్యం మరీ కొత్తగా లేదు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇంటెన్సిటీ వగైరాలు ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాయి. అంతులేని నిధిని స్వంతం చేసుకునే కుట్ర పన్నిన దుర్మార్గులను అడ్డుకోవడానికి బింబిసార రాజు మళ్ళీ పుట్టడమేనే కాన్సెప్ట్ తో రూపొందించినట్టు కనిపిస్తోంది.
కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మగధీర షేడ్స్ ఉన్నాయి. రావురమేష్ టైపు క్యారెక్టర్ లో అయ్యప్ప పి శర్మ, బాహుబలిని తలపించే గెటప్ తో ఫ్లాష్ బ్యాక్ కళ్యాణ్ రామ్, కొత్త జన్మలోనూ విలన్ ఉండటం ఇవన్నీ సిమిలర్ గా ఉన్నాయి. ఎంఎం కీరవాణి మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఆగస్ట్ 5న దుల్కర్ సల్మాన్ తో బింబిసార పోటీపడబోతున్నాడు. కంటెంట్ తో పాటు గ్రాఫిక్స్ మీద ఆధారపడిన ఈ ఫాంటసీ డ్రామాతో అయినా కళ్యాణ్ రామ్ పెద్ద బ్రేక్ అందుకుంటాడేమో చూడాలి. ఇందులో క్యాథరిన్ త్రెస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్లు కాగా వశిష్ట్ దర్శకత్వం వహించారు.
This post was last modified on July 4, 2022 8:54 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…