టికెట్ రేట్ల గురించి ముఖ్యంగా తెలంగాణలో ఎంత చర్చ జరుగుతోందో గత నాలుగైదు నెలలుగా చూస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ జిఓ ఇచ్చింది కదాని చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలకు అత్యాశకు పోయి ధరలు పెంచేయడం ఓపెనింగ్స్ మీద చాలా తీవ్ర ప్రభావం చూపించింది. ఓటిటిలో చూడొచ్చులే అనుకునే వాటికి కూడా మల్టీ ప్లెక్సులో 200 సింగల్ స్క్రీన్లలో 150కి పైగా పెట్టడం వల్ల కామన్ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. అటు ఏపిలోనూ పరిస్థితి మరీ ఆశాజనకంగా లేదు కానీ పర్వాలేదు అంతే.
అందుకే హ్యాపీ బర్త్ డే టీమ్ పాత స్ట్రాటజీకి వెళ్లిపోయింది. తమ సినిమాకు సింగల్ స్క్రీన్లలో 110 రూపాయలు, మాల్స్ లో 177 రూపాయలు టికెట్ రేట్ పెడుతూ దాన్నే మార్కెటింగ్ కోసం వాడుకుంటోంది. నిజానికి ఇందులో స్టార్ లెవరూ లేరు. కేవలం లావణ్య త్రిపాఠి కోసం హాలుకు జనం వచ్చే సీన్ లేదు. ప్రోమోలు ఆసక్తికరంగా అనిపించి ఏదో ట్రెండీ కంటెంట్ ఉందనిపించడం వల్ల యూత్ కొంతమేరకు దీనికి టర్న్ అవ్వొచ్చు కానీ సామాన్య ప్రేక్షకులు రావాలంటే మాత్రం ఇలాంటి ఎత్తుగడలు వేయడం మంచి ఫలితాన్ని ఇవ్వొచ్చు.
అయితే ఇది ఒక్కదానికే పరిమితం చేయకుండా రాబోయే అన్ని బడ్జెట్ సినిమాలకు ఇదే తరహా రేట్లు పెడితే మళ్ళీ థియేటర్లలో కాస్త ఎక్కువ సందడి కనిపించే అవకాశాలున్నాయి. హిట్టు ఫ్లాపు తర్వాత ముందైతే జనం హాలు దాకా వచ్చేలా చేయాలి. అది లేకుండా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు బిజినెస్ కోణంలోనే ఆలోచించడం వల్ల ఇప్పుడీ పరిస్థితి తలెత్తింది. ఒకవేళ హ్యాపీ బర్త్ డే ప్లాన్ కనక సక్సెస్ అయితే మిగిలినవాళ్లు కూడా అదే రూట్ పట్టొచ్చు. హైదరాబాద్ బుక్ మై షోలో రిలీజ్ రోజు ఒక సినిమా టికెట్ 110 రూపాయలు కనిపించి ఎంత కాలమయ్యిందో. పాత రోజులు గుర్తొస్తున్నాయని మూవీ లవర్స్ కామెంట్స్ పెడుతున్నారు.
This post was last modified on July 4, 2022 6:12 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…