మ్యాచో స్టార్ గోపీచంద్ కు పక్కా కమర్షియల్ కూడా దెబ్బేసింది. మారుతీ దర్శకుడు అందులోనూ మాస్ ఎంటర్ టైనర్ కాబట్టి మినిమమ్ ఆడుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉండేది. కానీ ఫలితం నెగటివ్ గానే వచ్చేసింది. ఇన్నేసి కోట్లు వచ్చాయని టీమ్ వరసగా పోస్టర్లు వదులుతోంది కానీ కీలకమైన నిన్నటి వీకెండ్ లో కూడా భారీ ఫిగర్లేమీ నమోదు కాలేదు. గత వారం వచ్చిన సమ్మతమే సోసోగా ఆడి బాక్సాఫీస్ స్పేస్ ని వదిలేసినా దాన్ని వాడుకోవడంలో కమర్షియల్ ఫెయిలయ్యింది. పోటీ లేకపోయినా లాభం లేకపోయింది.
ఇప్పుడు గోపీచంద్ ఆశలన్నీ శ్రీవాస్ డైరెక్షన్ లో చేయబోయే మూవీ మీదే ఉన్నాయి. ఇప్పటికే గట్టిగా చెప్పుకునే హిట్టు కొట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. 2014 లౌక్యం లాభాలు తెచ్చిన చివరి సక్సెస్. జిల్ పర్వాలేదనిపిస్తే సౌఖ్యం దారుణంగా బోల్తా కొట్టింది. గౌతమ్ నందాలో డ్యూయల్ రోల్ చేసినా ఏమీ ఒరగలేదు. ఆక్సిజన్ సంగతి సరేసరి. పంతం, చాణక్యలు ఎప్పుడు వచ్చాయో ఫ్యాన్స్ కే గుర్తు లేదు. సీటిమార్ సోసోగానే ఆడింది. బూజు దులిపి వదిలిన ఆరడుగుల బుల్లెట్ వల్ల కలిగిన ప్రయోజనం కన్నా డ్యామేజే ఎక్కువ.
మొత్తానికి గోపీచంద్ స్వీయ విశ్లేషణ సీరియస్ గా చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. మొదటి రోజు మినిమమ్ హౌస్ ఫుల్ చేసే రేంజ్ ని ఆల్రెడీ పోగొట్టుకున్నాడు. దాన్ని తిరిగి రాబట్టుకోవాలంటే బ్లాక్ బస్టర్ పడాలి. లేదంటే శ్రీకాంత్ తరహాలో మెల్లగా కెరీర్ గ్రాఫ్ ఇంకా డౌన్ అయిపోయి సపోర్టింగ్ రోల్స్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. లేదూ వర్షం, జయం తరహాలో ఏదైనా పవర్ ఫుల్ నెగటివ్ రోల్స్ చేసినా మళ్ళీ మార్కెట్ పుంజుకోవచ్చు. మాస్ అయితేనే తనను చూస్తారనే అభిప్రాయం నుంచి గోపీచంద్ అర్జెంట్ గా బయటికి రావాలి.
This post was last modified on July 4, 2022 3:52 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…