రేస్ నుంచి కార్తికేయ 2 ఔట్

నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2కి అఫీషియల్ గా ముందు ప్రకటించిన విడుదల తేదీ జూలై 22. కానీ ఇప్పుడా డేట్ కి రావడం లేదని ఫిలిం నగర్ టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ ఉండటంతో పాటు ప్రమోషన్ కు తగినంత సమయం లేదని భావించడం వల్లే వాయిదా వేస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి తోడు అదే రోజు నాగ చైతన్య థాంక్ యుని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

ఇది కాకుండా కేవలం వారం గ్యాప్ లో మరో ప్యాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోనా వస్తోంది. సుదీప్ హీరో కాబట్టి మార్కెటింగ్ బలంగా జరుగుతోంది. ఇది చాలదన్నట్టు రన్బీర్ కపూర్ శంషేరా కూడా అన్ని భాషల్లో 22నే వస్తోంది. ఇలా చూసుకుంటే అందరి కంటే మార్కెట్ పరంగా వీక్ గా ఉన్నది నిఖిలే. మధ్యలో వచ్చి నలిగిపోవడం కంటే సేఫ్ గా పక్కకు తప్పుకోవడం బెటరని అలోచించి ఉండొచ్చు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించారు.

కార్తికేయకు సీక్వెల్ అని చెబుతున్నారు కానీ ఇది పూర్తిగా వేరే కథతో రూపొందించినట్టు కనిపిస్తోంది. పైగా బడ్జెట్ కూడా భారీగానే పెట్టారు. అలాంటప్పుడు సోలోగా వస్తేనే బెటర్. ఇన్నేసి సినిమాలతో పోటీ పడితే ఓపెనింగ్స్ తో పాటు వసూళ్ల పరంగానూ ఇబ్బందులు ఎదురుకోవాల్సి ఉంటుంది. అర్జున్ సురవరం వచ్చి మూడేళ్లు అవుతోంది. మళ్ళీ నిఖిల్ స్క్రీన్ మీద కనిపించలేదు. 18 పేజెస్, స్పై లకు బిజినెస్ బాగా జరగాలంటే ఈ కార్తికేయ 2 పెద్ద హిట్ అవ్వడం చాలా అవసరం. అందుకే ఇంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు