నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘లైగర్’ గురించే చర్చ. ఇండియాలో టాప్‌లో ట్రెండ్ అయింది ఆ సినిమా పేరు. ‘లైగర్’ నుంచి రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ కొత్త లుక్ మామూలుగా ప్రకంపనలు రేపలేదు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ఈ పోస్టర్ చూసి షాకైపోయారు. సామాన్య ప్రేక్షకుల విషయానికి వస్తే చాలా వరకు నెగెటివ్ కామెంట్లే పడ్డాయి ఆ పోస్టర్ గురించి. ఒక రేంజిలో ట్రోల్స్ పడ్డాయి.
ఇక మీమ్ క్రియేటర్లయితే తమ క్రియేటివిటీకి పదును పెట్టి బోలెడన్ని జోకులు, మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పోసేశారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా పోస్టర్ గురించీ ఇంత రచ్చ జరగలేదంటే అతిశయోక్తి కాదు. తనకంటే పెద్ద స్టార్ల సినిమాలకు మించి ఈ పోస్టర్‌తో విజయ్ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేయగలిగాడన్నది వాస్తవం. చాలామంది విజయ్ ట్రోల్ అయ్యాడు అనుకుంటున్నారు కానీ.. అలా అయినా ‘లైగర్’ను డిస్కషన్లో పెట్టగలిగాడన్నది వాస్తవం.
ఈ రోజుల్లో పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా.. సోషల్ మీడియాలో తమ సినిమా గురించి విడుదలకు ముందు చర్చ జరిగేలా చేసుకోవడం ముఖ్యం. ‘లైగర్’కు ఎందుకో గానీ ఇప్పటి వరకు అయితే సరైన బజ్ క్రియేట్ అవ్వలేదు. దీని ప్రోమోలు అంతగా ఆసక్తి రేకెత్తించలేదు. పైగా సినిమా చాలా చాలా ఆలస్యం అయింది. వచ్చే నెలలోనే ‘లైగర్’ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సి ఉండగా.. ప్రమోషన్ల పరంగా ఏదో ఒక అద్భుతం జరగాల్సిన అవసరం ఉంది. అందుకే వ్యూహాత్మకంగానే ఈ న్యూడ్ పోస్టర్ లాంచ్ చేసినట్లున్నారు.
‘అర్జున్ రెడ్డి’ దగ్గర నుంచే బోల్డ్ ప్రోమోలకు విజయ్ పెట్టింది పేరు. కాబట్టి ఇలాంటి పోస్టర్ రిలీజ్ చేయడంలో అతడికి పెద్ద అభ్యంతరాలేమీ లేకపోవచ్చు. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లున్నాడు. మొత్తానికి ‘లైగర్’ టీం కోరుకున్న రెస్పాన్స్ అయితే వచ్చేసింది. ఒక్క పోస్టర్‌తో సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేటైంది. మరి మున్ముందు ప్రమోషన్‌ను విజయ్, పూరి కలిసి ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.
This post was last modified on July 4, 2022 9:26 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…