ఒకప్పుడు ఐటెం సాంగ్స్ చేయడానికి వేరుగా కొందరు అమ్మాయిలుండేవాళ్లు. కాస్త పేరున్న హీరోయిన్లెవరూ వాటి జోలికి వెళ్లేవాళ్లు కాదు. కానీ కాల క్రమంలో వ్యవహారం మొత్తం మారిపోయింది. స్టార్ హీరోయిన్లే ఐటెం భామలుగా మారి ఆ పాటల స్థాయిని పెంచేశారు. అనుష్క, కాజల్, తమన్నా, సమంత, శ్రుతి హాసన్.. ఇలా టాప్ హీరోయిన్లందరూ ఐటెం సాంగ్స్‌తో మెరిసిన వాళ్లే.
ఐతే కథానాయికగా వీళ్ల రేంజ్ కాకపోయినా.. తెలుగమ్మాయి అంజలి సైతం ఐటెం సాంగ్‌తో బలమైన ముద్రే వేసింది. ఆమె ‘సరైనోడు’ సినిమాలో చేసిన బ్లాక్ బస్టర్ సాంగ్ పెద్ద బ్లాక్‌బస్టర్ కావడం తెలిసిన విషయమే. అప్పటిదాకా అంజలికి ఉన్న హోమ్లీ ఇమేజ్‌కి.. ఐటెం సాంగ్ అసలు సెట్టవుతుందా అన్న సందేహాలు చాలామందికి కలిగాయి. కానీ అంజలి ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ ఆ పాటలో అదరగొట్టింది. అల్లు అర్జున్‌కు దీటుగా స్టెప్పులేసి, హాట్‌గా కనిపించి మెప్పించింది.
ఆ పాట అంత పెద్ద హిట్టయినా అంజలి ఆ తర్వాత మళ్లీ ఐటెం సాంగ్ చేయలేదు. ఎట్టకేలకు మళ్లీ ఆమెను మళ్లీ ఆ టైపు పాటలో చూడబోతున్నాం. నితిన్ కొత్త చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం అంజలి మళ్లీ ఐటెం గర్ల్ అవతారం ఎత్తింది. ఈ పాట గురించి వెల్లడిస్తూ.. తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది ‘మాచర్ల నియోజకవర్గం’ టీం. కేవలం పోస్టర్‌తోనే అంజలి అందరి దృష్టినీ తన వైపు తిప్పేసుకుంది. అంత ఆకర్షణీయమైన లుక్‌తో కనిపిస్తోందీ తెలుగమ్మాయి.
ఓవైపు ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి కొత్తగా రిలీజ్ చేసిన ఐటెం సాంగ్ విషయంలో నెగెటివిటీ కనిపిస్తున్న దశలోనే.. అంజలి ఐటెం సాంగ్ పోస్టర్ హైలైట్ అవడం విశేషం. మరి ఈ పాటలో అంజలి ఎలా మెరుపులు మెరిపిస్తుందో.. ఈ పాట ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 3, 2022 4:13 pm
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…