Movie News

లైగర్ నగ్న లాజిక్ కరెక్టేనా

నిన్న వదిలిన విజయ్ దేవరకొండ లైగర్ న్యూడ్ లుక్ సోషల్ మీడియాలో మాములు రచ్చ చేయలేదు. ఉద్దేశం ఏదైనా ఇలా నగ్నంగా ఫోజులు ఇవ్వడం పట్ల నెటిజెన్లు గట్టిగానే కౌంటర్లిచ్చారు. మరోవైపు సమంతా లాంటి వాళ్ళ మద్దతు దొరికినప్పటికీ ఫైనల్ గా ఆన్ లైన్ ట్రోలింగ్ లోని సీరియస్ నెస్ టీమ్ కి అర్థమైపోయింది. దెబ్బకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే బాక్సింగ్ పోటీల్లో బరువు కొలిచేందుకు ఇలా బట్టలు లేకుండా నిలబెడతారని అందుకే ఈ స్టిల్ అందులో భాగమని చెప్పుకొచ్చారు.

వినడానికి బాగానే ఉంది కానీ ఇందులో కొన్ని లాజిక్స్ మిస్ అవుతోంది లైగర్ టీమ్. ఉదాహరణకు చాలా జైళ్లల్లో శిక్ష పడ్డ ఖైదీకి తెల్ల దుస్తులు ఇచ్చే ముందు నగ్నంగా చెకింగ్ జరుగుతుంది. అల్లరి నరేష్ నాందిలో చూపించారు కూడా. కాకపోతే మరీ ఓపెన్ గా కాకుండా జాగ్రత్త పడ్డారు. అలా అని దాన్నే హైలైట్ చేస్తూ పబ్లిసిటీ చేయలేదు. మరో ఎగ్జాంపుల్ తీసుకుంటే హీరోకు శోభనం సీన్ ఉందంటే నేరుగా ప్రకృతి కార్యాన్ని చూపించలేరుగా. వెబ్ సిరీస్ లలో ఏమో కానీ సినిమాల్లో మాత్రం తలుపేసినట్టు చూపించి కట్ చేస్తారు.

అలాంటప్పుడు సహజత్వం కోసమే ఇలా చేశామని లైగర్ చెప్పడంలో సహేతుకమైన కారణం ఉన్నప్పటికీ అంత పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలో ఇదే దొరికిందా అంటూ యాంటీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అంటే మైక్ టైసన్ ది కూడా ఇలాంటి పోస్టరే వదులుతారా అని డిమాండ్ చేస్తున్నారు. సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన అల్టిమేట్ బాక్సింగ్ మూవీ రాకీకి సైతం ఈ తరహా పబ్లిసిటీ లేదన్నది వాళ్ళ వెర్షన్. ఏది ఏమైనా లైగర్ కోరుకున్న ప్రమోషన్ ఫుల్ గా వచ్చేసింది. ఇదే ఇలా ఉంటే టీజర్ ట్రైలర్లు నెక్స్ట్ లెవెల్ లో వస్తాయేమో

This post was last modified on July 3, 2022 2:17 pm

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

30 minutes ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

44 minutes ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

1 hour ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

2 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

2 hours ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

3 hours ago