టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొంది 1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు వంద రోజులు పూర్తి చేసుకుంది. నిన్న టీమ్ అఫీషియల్ గా ఒక వర్కింగ్ స్టిల్ తో పాటు అఫీషియల్ పోస్టర్ ను వదిలింది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేశవిదేశీయుల నుంచి గొప్ప ప్రశంసలు దక్కుతున్న టైంలో ఈ నెంబర్ అందుకోవడం అభిమానులకు ఆనందంగానే ఉంది కానీ ఒక్క వెలితి మాత్రం మైనస్ గా తోస్తోంది. ఆర్ఆర్ఆర్ ఎక్కడా ఏ సెంటర్ లోనూ డైరెక్ట్ గా హండ్రెడ్ డేస్ ఆడలేదు. యాభై రోజులు కాగానే ప్యాకప్ అయిపోయింది.
కనీసం ఒక్క కేంద్రమైనా వచ్చి ఉంటే బాగుండేదని మూవీ లవర్స్ ఫీలవుతున్నారు. అయినా ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కడున్నాయి. మూడు వారాలు దాటితే ఎంత కొమ్ములు తిరిగిన బ్లాక్ బస్టర్ అయినా సర్దుకోవాల్సిందే. విక్రమ్, కెజిఎఫ్ 2లు సైతం నెల తర్వాత స్లో అయినవే. అలాంటప్పుడు ట్రిపులార్ మాత్రమే మినహాయింపుగా నిలవాలనుకోవడం అనూహ్యం. దీనికి ఓటిటినే కారణమని చెప్పలేం. రంగస్థలం చాలా త్వరగా 45 రోజులకే ప్రైమ్ లో వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో స్ట్రెయిట్ శతదినోత్సవాలు తెచ్చుకుంది.
కానీ కరోనా తర్వాత సీన్ మారిపోవడంతో గ్రాండియర్ నెస్ తో సంబంధం లేకుండా ఫైనల్ రన్ లు త్వరగా వచ్చేస్తున్నాయి. కాకపోతే రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు ఇంకా గొప్ప ఫలితాన్ని ఆశించాడు. కెజిఎఫ్ 2 అందుకున్న పన్నెండు వందల కోట్ల మార్క్ ని ఆర్ఆర్ఆర్ చేరుకోలేకపోయింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అతి పెద్ద హిట్టుగా నిలుస్తుందన్న జక్కన్న లెక్క కొద్దిలో తప్పింది. ఆ మాత్రాన ఆర్ఆర్ఆర్ ని తక్కువ చూడలేం కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫారినర్స్ పొగడ్తల జల్లు ఈ మల్టీ స్టారర్ మీద కొనసాగుతూనే ఉంది.
This post was last modified on July 3, 2022 12:30 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…