కమల్ హాసన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విక్రమ్ థియేట్రికల్ రన్ క్లైమాక్స్ కు చేరుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జూలై 8 నుంచి హాట్ స్టార్ లో ప్రీమియర్ కానున్న సంగతి తెలిసిందే. కేవలం 35 రోజుల వ్యవధిలో ఓటిటిలో మళ్ళీ మళ్ళీ చూసే ఛాన్స్ రాబోతున్నందుకు మూవీ లవర్స్ ఆనందం మాములుగా లేదు. కమల్ ఫ్యాన్స్ మాత్రం కనీసం యాభై రోజుల విండో ఉంటే ఇంకో ఇరవై కోట్లు అదనంగా వసూలు చేసే ఛాన్స్ ఉండేదని వాపోతున్నారు. తెలుగులో ఆల్రెడీ పది రోజుల నుంచే విక్రమ్ నెమ్మదించింది
రెండు భాషల్లో ట్రిపుల్ ప్రాఫిట్స్ ఇచ్చిన విక్రమ్ దెబ్బకు కమల్ మరుగున పడిన ప్రాజెక్టులు కూడా బయటికి వచ్చేలా ఉన్నాయి. ఎప్పుడో పక్కనపెట్టేసిన శభాష్ నాయుడుని రీ స్టార్ట్ చేసే ఆలోచన జరుగుతోంది. ఇరవై ఏళ్ళ క్రితం ఆపేసిన మారుదనాయగం కొనసాగించమని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. వీటికి తోడు ఇండియన్ 2 ఎలాగూ ఉంది. కమల్ మాత్రం విక్రమ్ 2 మీద మనసు పడ్డారట. కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ విజయ్ కిచ్చిన కమిట్ మెంట్ వల్ల అంత సులభంగా తెరకెక్కకపోవచ్చు.
ఒక్క తమిళ వెర్షన్ నుంచే 400 కోట్లకు పైగా రాబట్టిన విక్రమ్ అక్కడ బాహుబలి 2ని దాటేసి నెంబర్ వన్ స్థానంలో కూర్చుంది. దీని వల్ల రజినీకాంత్ మీద ఒత్తిడి మొదలయ్యింది. తన స్నేహితుడిని జైలర్ తో క్రాస్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక హాట్ స్టార్ లో వచ్చాక వ్యూస్ పరంగా కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఆ ప్లాట్ ఫార్మ్ లో అఖండ, భీమ్లా నాయక్, బ్రో డాడీ లాంటి కొన్ని సౌత్ సినిమాలే వ్యూస్ లో డామినేట్ చేశాయి. ఇప్పుడు విక్రమ్ వచ్చాక ఇవన్నీ తప్పుకోవడం లాంఛనమే.
This post was last modified on July 2, 2022 9:37 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా సహా పొరుగున ఉన్న…