‘ఊహలు గుసగుసలాడే’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయమై.. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది ఢిల్లీ భామ రాశి ఖన్నా. ఇప్పుడు ఆమెను ఎవ్వరూ పరభాషా కథానాయికగా చూడట్లేదు. ఓ తెలుగమ్మాయిలాగే భావిస్తున్నారు. అంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది. తెలుగు గడ్డే అయిన హైదరాబాద్‌లో ఓ ఇల్లు కూడా కొనుక్కుంది. ఆమె ఇప్పటిదాకా ఎక్కువగా చేసింది తెలుగు సినిమాలే అన్న సంగతీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా.. త్వరలోనే ‘థ్యాంక్ యు’తో పలకరించబోతోంది రాశి.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధం గురించి పంచుకుంది. తాను ఢిల్లీ అమ్మాయిని అయినా.. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో ఓన్ చేసుకున్నారని ఆమె అంది. రాజమండ్రిలో ‘ప్రతి రోజు పండగే’ చిత్రం కోసం షూటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని వచ్చి ఆటోగ్రాఫ్ అడిగాడని, తాను ఆటోగ్రాఫ్ చేయగా.. దాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడని.. ఆ క్షణం తనకు ఎంతో ఆనందం కలిగిందని, ఇలాంటి అభిమానులు ఉండడం తన అదృష్టమని రాశి పేర్కొంది.
తన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’లో తాను చేసిన ప్రభావతి పాత్ర తనకెంతో ఇష్టమని.. ఆ తర్వాత అంతగా ఇష్టపడ్డ పాత్ర ‘వరల్డ్ ఫేమస్ లవర్’లోని యామినినే అని రాశి పేర్కొంది. కానీ తాను అంతగా ఇష్టపడ్డ పాత్ర ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదని.. ఆ సినిమా రిలీజైనపుడు అందరూ తనను ట్రోల్ చేశారని రాశి పేర్కొంది. ఆ చిత్రంలో రాశి కొన్ని బోల్డ్ సీన్స్ చేయడంపై అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ముందు నుంచి హోమ్లీ హీరోయిన్‌గా గుర్తింపు ఉండడంతో ఆ బోల్డ్ సీన్లు చేయడం అభిమానులకు రుచించకపోయి ఉండొచ్చు. తనకు కాబోయే భర్త దైవ భక్తి ఎక్కువ ఉన్నవాడు, మంచి వాడు అయ్యుండాలని ఈ ఇంటర్వ్యూలో రాశి పేర్కొనడం విశేషం.
This post was last modified on July 2, 2022 6:05 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…