ఆ మధ్య విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు. ‘పుష్ప’ తర్వాత సుకుమార్ సినిమా ఇదే అంటూ ఊదరగొట్టారు. కానీ ‘పుష్ప’ రిలీజ్ కి ముందు తీసుకున్న రెండు భాగాల నిర్ణయంతో విజయ్ సినిమాను పక్కన పెట్టేశాడు సుక్కు. విజయ్ కూడా పూరితో రెండు సినిమాలు , మైత్రి లో ఓ సినిమాతో బిజీ అయిపోయాడు. అయితే ఈ కాంబో ప్రాజెక్ట్ అసలు ఉంటుందా ? లేదా అనే ప్రశ్న ఇప్పుడు మూవీ లవర్స్ లో కలుగుతుంది.
సుక్కు హీరోలని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తాడు ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతకు ముందు ఏ దర్శకుడూ చూపించని విధంగా హీరోని చూపిస్తాడు. అందుకే విజయ్ తో సినిమా ప్రకటన రాగానే దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుండటంతో ఇప్పుడు తమ సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. నిజానికి విజయ్ సినిమాకు సంబంధించి సుక్కు ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. ఒక లైన్ ఒకే అనుకున్నారు అంతే స్క్రిప్ట్ ఇంకా లాక్ అవ్వలేదు.
ప్రస్తుతం సుక్కు తన ఫోకస్ అంతా ‘పుష్ప ది రూల్’ మీదే పెట్టాడు. పార్ట్ 1 తో వచ్చిన భారీ క్రేజ్ తో ఉబ్బి తబ్బిబవుతున్నాడు. త్వరలోనే పుష్ప 2 షూట్ మొదలు కానుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో సుక్కు ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. సుక్కు లిస్టులో ఇంకో భారీ ప్రాజెక్ట్ కూడా ఉందని అంటున్నారు. మరి సుకుమార్ ‘పుష్ప 2’ తర్వాత ముందుగా ఎనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ సినిమానే మొదలు పెడతాడా ? లేదా బిగ్ స్టార్ ప్రాజెక్ట్ వైపు వెళ్ళిపోతాడా తెలియాలంటే సుక్కు నుండి కానీ విజయ్ నుండి గానీ ఏదైనా అప్డేట్ రావలసిందే. లేదా ప్రొడక్షన్ హౌజ్ అయినా క్లారిటీ ఇవ్వాలి.
This post was last modified on July 2, 2022 6:12 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…