ప్రస్తుతం కీలక నిర్మాణ దశలో ఉన్న సినిమాలకు రిలీజ్ డేట్లు లాక్ చేసుకోవడం పెద్ద సమస్యే అయ్యింది. పోటీ లేకుండా ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నా ఏవో అవాంతరాలు వచ్చి పడుతూనే ఉన్నాయి. వాటిలో ఏజెంట్ ఒకటి. ఒళ్ళు హూనం చేసుకుని మరీ సిక్స్ ప్యాక్ తో సిద్ధమైన అక్కినేని అఖిల్ కు ఇది మాస్ లో పెద్ద బ్రేక్ ఇస్తుందనే అంచనాలు అభిమానుల్లో భారీగా ఉన్నాయి. ఆగస్ట్ 12 రిలీజ్ డేట్ ని గతంలో ప్రకటించారు కానీ ఇప్పుడు వాయిదా లాంఛనమే. కాకపోతే మళ్ళీ ఎప్పుడనేది ఫ్యాన్స్ ని తొలుస్తున్న పెద్ద ప్రశ్న.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఏజెంట్ టీమ్ దసరాని టార్గెట్ చేస్తోందట. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కూడా అదే సీజన్ కి ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉందని ఈ రెండింటి క్లాష్ తప్పకపోవచ్చనే ప్రచారం మొదలయ్యింది. నిజానికి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే మెగా అక్కినేని ఫ్యామిలీల మధ్య ఉన్న బాండింగ్ అందరికీ తెలిసిందే. ఎంత పరిస్థితులు డిమాండ్ చేస్తున్నా సరే కావాలని ఢీ కొట్టాలని అనుకోరు. పైగా ఆచార్య సూపర్ డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ తో సక్సెస్ కొట్టడం మెగాస్టార్ కు చాలా కీలకంగా మారింది.
అలాంటప్పుడు తన రీమేక్ సినిమాతో ఏజెంట్ లాంటి హై వోల్టేజ్ యాక్షన్ మూవీతో తలపడరు. పైగా అఖిల్ కు చిరుతో ఉన్న బంధం ఎలాంటిదంటే విక్రమ్ సక్సెస్ మీట్ అయ్యాక కమల్ హాసన్ చిరు ఇంటికి వెళ్ళినప్పుడు బయటి నుంచి వచ్చిన అతికొద్ది మందిలో ఈ కుర్ర హీరో ఉన్నాడు. ఇదంతా ఒక ఎత్తయితే ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకరనే భోళా శంకర్ ప్రొడ్యూసర్. సో ఒక అండర్ స్టాండింగ్ తోనే రెండు డేట్లు మాట్లాడుకుని అనౌన్స్ చేస్తారు. ఎలా చూసుకున్నా ముందు ఏజెంట్ తాలూకు అప్డేటే త్వరగా వచ్చే అవకాశముంది.
This post was last modified on July 1, 2022 5:07 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…