టాలీవుడ్లో ఎంతోమంది హీరోలకు పెద్ద పెద్ద హిట్లిచ్చాడు పూరి జగన్నాథ్. చిన్నా చితకా వేషాలు వేసుకుంటున్న రవితేజ అనే నటుడు హీరోగా నిలదొక్కుకుని స్టార్‌గా ఎదిగాడంటే అది పూరి పుణ్యమే. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ల కెరీర్లు మరో స్థాయికి వెళ్లడానికి పూరి కారణం అనడంలో సందేహం లేదు. ఇంకా మరికొందరు హీరోలకు కెరీర్లో మరిచిపోలేని సినిమాలిచ్చాడు పూరి. అలాంటిది తన కొడుకు పూరి ఆకాష్‌ను మాత్రం ఆయన హీరోగా నిలబెట్టలేకపోయాడు.
బాల నటుడిగా తన సినిమాల్లో అతణ్ని బాగానే ప్రమోట్ చేశాడు కానీ.. ఇంకా టీనేజీలో ఉండగానే ‘ఆంధ్రా పోరి’ అనే సినిమా చేయించడం పెద్ద మిస్టేక్. తర్వాత కొన్నేళ్లకు తన దర్శకత్వంలో ‘మెహబూబా’ అనే పేలవమైన సినిమా చేయించడం ఇంకా పెద్ద మిస్టేక్. తాను పేలవ ఫాంలో ఉన్న టైంలో కొడుకును హీరో చేయాల్సి రావడం పూరి దురదృష్టం.
ఆ తర్వాత వేరే దర్శకులకు అప్పగించినా ఫలితం లేకపోయింది. వాళ్లు తీసిన సినిమాలతో పోలిస్తే పూరి తీసిన చిత్రమే నయం అనుకునే పరిస్థితి. గత ఏడాది వచ్చిన ‘రొమాంటిక్’ ఫ్లాప్ అయినా.. ఆకాష్ బాగా చేశాడనే పేరైనా తెచ్చింది. కొంతమేర యూత్‌ను అయినా ఆ సినిమా ఆకర్షించింది. కానీ ఇటీవలే రిలీజైన ఆకాష్ సినిమా ‘చోర్ బజార్’ అయితే మరీ ఘోరం. ఈ సినిమాలోచెప్పుకోవడానికి ఒక్క ప్లస్ పాయింట్ లేదు. ఇంత పేలవమైన సినిమాను ఆకాష్ ఎలా ఒప్పుకున్నాడో, పూరి ఎలా దీన్ని ఓకే చేశాడో అర్థం కాని పరిస్థితి.
ఈ సినిమా చూసిన చాలామంది.. ఆకాష్ హీరోగా నిలదొక్కుకోవడంపై సందేహాలు వ్యక్తం చేశారు. అరంగేట్రానికి ముందే బంపర్ క్రేజ్ తెచ్చుకున్న అఖిల్ సైతం వరుసగా మూడు డిజాస్టర్లు ఇచ్చాక కెరీర్ బాగా డౌన్ అయిపోయింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పర్వాలేదనిపించినా కూడా ఇంకా కూడా నెగెటివిటీని అధిగమించలేకపోతున్నాడు. కెరీర్ ఏమాత్రం ఊపందుకుంటుందో అన్న సందేహాలు కొనసాగుతున్నాయి. అలాంటిది ఆకాష్ ఇక పుంజుకోగలడా.. ‘రొమాంటిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లు హీరోగా నిలదొక్కుకుని తండ్రి గర్వించేలాగా చేయగలడా అన్నది చూడాలి.
This post was last modified on June 30, 2022 10:06 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…