విశ్వక్ సేన్ కు యూత్ లో మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఫలక్ నుమా దాస్. బ్లాక్ బస్టర్ కాకపోయినా దీని బడ్జెట్ రేంజ్ కి మించి బాగానే పెర్ఫార్మ్ చేసి ప్రొడ్యూసర్లకు నష్టాలు రాకుండా గట్టెక్కించింది. విశ్వక్ లోని దర్శకుడు బయటపడింది కూడా దీంతోనే. అయితే ఒరిజినల్ మలయాళం వెర్షన్ అంగమలై డైరీస్ కున్న కల్ట్ ఫాలోయింగ్ వేరే లెవెల్. 2017లో రిలీజైన ఈ క్లాసిక్ ని అక్కడి విమర్శకులు సందర్భం వచ్చినప్పుడల్లా పొగుడుతూనే ఉంటారు. ముఖ్యంగా 11 నిముషాలు నాన్ స్టాప్ గా షూట్ చేసిన క్లైమాక్స్ గురించి.
ఇప్పుడీ సినిమా బాలీవుడ్ కు వెళ్తోంది. ఖైదీ, మాస్టర్, ఇటీవలే వచ్చిన విక్రమ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్ ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్నారు. మధుమిత సుందరరామన్ దర్శకత్వం వహించబోతున్నారు. మనకు పరిచయం లేదు కానీ కెడి కరుప్పుదుర చూసిన వాళ్లకు ఇతని టాలెంట్ బాగా ఎరుకే. సూర్య ఆకాశమే నీ హద్దురాని హిందీలో పునఃనిర్మిస్తున్న నిర్మాణ సంస్థే దీన్ని టేకప్ చేసింది. అర్జున్ దాస్ ఇంత త్వరగా ఏకంగా హిందీలో సోలో హీరోగా అడుగు పెట్టడం విశేషమే.
నిజానికి విశ్వక్ సేన్ తెలుగులో ఫలక్ నుమా దాస్ పార్ట్ 2కి ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలో కథ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే కంటిన్యూ చేసేలా ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. ఈసారి పూర్తిగా స్వంత వెర్షన్ ని డెవలప్ చేయబోతున్నారు. గొప్పగా ఆడని సినిమాకు సీక్వెల్ ఎందుకని కామెంట్స్ వచ్చిన్నప్పటికీ తనకో బ్రేక్ ప్లస్ ఇమేజ్ తెచ్చిన ఆ సినిమాకు కొనసాగింపు ఉండాలని విశ్వక్ లక్ష్యం. ఒకవేళ ఇది హిట్ అయితే రివర్స్ లో మల్లువుడ్ లో రీమేక్ చేస్తారేమో చూడాలి.
This post was last modified on June 30, 2022 7:47 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…