టెంపర్.. ఇస్మార్ట్ శంకర్.. గత దశాబ్ద కాలంలో పూరి జగన్నాథ్ నుంచి వచ్చిన హిట్లు ఈ రెండు చిత్రాలే. అందులో ‘టెంపర్’ ఆయన కథ కాదు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఫ్లూక్ హిట్ అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇలాంటి ట్రాక్ రికార్డున్న పూరి జగన్నాథ్‌తో విజయ్ దేవరకొండ లాంటి హాట్ షాట్ హీరో ‘లైగర్’ సినిమా కోసం జట్టు కట్టడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. నిజానికి విజయ్ అభిమానులకు పూరితో సినిమా చేయడం ఇష్టం లేనట్లే కనిపించింది సోషల్ మీడియాలో వారి కామెంట్లు చూస్తే. ‘లైగర్’ ఎలాంటి ఫలితం అందుకుంటుందో అని వాళ్లంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఐతే ఈ సినిమా రిజల్ట్ చూడకుండానే పూరీతో ‘జేజీఎం’ సినిమాకు విజయ్ రెడీ అయిపోవడం వారికి రుచించలేదు. పూరి హడావుడిగా ఈ సినిమాకు కమిట్ చేయించేశాడని.. ‘లైగర్’ రిలీజయ్యే వరకు విజయ్ ఆగాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. ఐతే కమిటయ్యాడు కాబట్టి సినిమా చేయక తప్పదు అనుకుంటుండగా.. పూరీతో విజయ్ మరో సినిమా కూడా చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంకా ‘జేజీఎం’ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకముందే పూరీతో మరో సినిమా చేయడానికి విజయ్ కమిట్మెంట్ ఇచ్చేశాడని అంటున్నారు. విజయ్-పూరి కలయికలో హ్యాట్రిక్ మూవీ రాబోతోందని కొన్ని పీఆర్వో హ్యాండిల్స్ నుంచి కూడా ట్వీట్లు పడుతున్నాయి. ఐతే ‘లైగర్’ ప్రమోషన్లు ఇప్పుడే మొదలవుతున్న నేపథ్యంలో హైప్ కోసం ఈ విషయాన్ని లీక్ చేశారేమో అన్న డౌట్లు కొడుతున్నాయి.
‘లైగర్’ రిలీజై దాని రిజల్ట్ చూశాక కానీ పూరి ఇప్పుడెలాంటి ఫాంలో ఉన్నాడో తెలియదని.. అది కనుక తేడా కొడితే ‘జేజీఎం’ విషయంలోనే సందేహాలు నెలకొంటాయని, అలాంటపుడు మరో సినిమా చేయడానికి ఇప్పుడే కమిట్మెంట్ ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యంగ్ ఫిలిం మేకర్స్, ట్రెండీ డైరెక్టర్లు చాలా మంది ఎదురు చూస్తుండగా.. విజయ్ ఇలా పూరీతో లాక్ అయిపోవడం చాలామందికి రుచించడం లేదు. మరి విజయ్.. నిజంగానే పూరీతో మరో సినిమాకు కమిటయ్యాడా లేదా అన్నది క్లారిటీ వస్తుందేమో చూడాలి.
This post was last modified on June 30, 2022 5:36 pm
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…