గత శుక్రవారం లాగే ఇప్పుడు కూడా ఏకంగా ఎనిమిది సినిమాలు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగింది పక్కా కమర్షియల్ ఒకటే అయినప్పటికీ దానికీ అడ్వాన్స్ బుకింగ్స్ మరీ జోరుగా ఏం లేవు. టికెట్ రేట్ల తగ్గింపే ప్రమోషన్ మంత్రంగా గీతా ఆర్ట్స్ దీనికి మంచి పబ్లిసిటీనే ఇస్తోంది. మాస్ లో గోపీచంద్ ఇమేజ్, దర్శకుడు మారుతీ ట్రాక్ రికార్డు ఏ మేరకు ఓపెనింగ్స్ కి హెల్ప్ అవుతాయో జూలై 1న మార్నింగ్ షో పూర్తయ్యాక కాని క్లారిటీ రాదు. అప్పటిదాకా వేచి చూడాలి.
ఇక ఏనుగు టైటిల్ తో అరుణ్ విజయ్ డబ్బింగ్ మూవీ ఒకటొస్తోంది. సింగం సిరీస్ సృష్టికర్త హరి దర్శకుడు. ట్రైలర్ ఊర మాస్ గా అనిపించింది కానీ ఇది జనాన్ని ఏ మేరకు థియేటర్ కు రప్పిస్తుందో చూడాలి. మాధవన్ స్వీయ దర్శకత్వం వహించిన రాకెట్రీ మీద తెలుగులో ఏమంత బజ్ లేదు. మేజర్ రేంజ్ లో టాక్ వస్తేనే నిలదొక్కుకుంటుంది టెన్త్ క్లాస్ డైరీస్, హుషారు, ఏమైపోతావే, ఈవిల్ లైఫ్ అని ఇంకొన్ని చిన్న సినిమాలున్నాయి కానీ వీటికి కనీసం పాతిక శాతం ఆక్యుపెన్సీ వచ్చినా గొప్పే అనేలా ఉంది పరిస్థితి.
ఒక పక్క జనం థియేటర్లకు రావడం లేదని వాపోతున్న ఇండస్ట్రీ వర్గాలు ఇన్నేసి చిత్రాలు క్లాష్ అవ్వడం వల్ల ఓపెనింగ్స్ మీద పడే ప్రభావాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.ఏదో ఓటిటిలు కండీషన్ పెట్టాయి కదాని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న మాట వాస్తవమే అయితే దీనికీ భవిష్యత్తులో ఎక్కడో ఒక చోట బ్రేక్ పడుతుంది. ప్రేక్షకులకు మరీ ఎక్కువ ఆప్షన్లు ఉన్నా చిక్కే. కన్ఫ్యూజన్ లో ఏదీ వద్దకునునే ప్రమాదం లేకపోలేదు. ఉన్నంతలో పక్కా కమర్షియల్ కే ఎక్కువ ఎడ్జ్ ఉంది కనక ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి
This post was last modified on June 30, 2022 9:05 am
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…
వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు…
రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార విడుదల చేసిన…
ప్రజాయుద్ధ నౌక.. ప్రముఖ గాయకుడు గద్దర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇచ్చింది. గద్దర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెలను…
దక్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ పేరు తట్టకపోవచ్చు కానీ.. తన చేతిలో ఉన్నప్రాజెక్టుల లిస్టు చూస్తే…