రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఈ ఇద్దరితోనూ నటించిన హీరోయిన్లలో తమన్నా ఒకరు. చరణ్‌తో ‘రచ్చ’ చేసిన ఆమె.. బన్నీ సరసన ‘బద్రీనాథ్’లో నటించింది. ఐతే ఈ ఇద్దరితో కలిసి మిల్కీ బ్యూటీ ఒకేసారి పని చేయబోతున్నట్లు తాజా సమాచారం. వాళ్లిద్దరితో కలిసి అంటే.. ‘ఎవడు’ తరహాలో మల్టీస్టారర్ ఏమైనా చేయబోతున్నారా అని ఆశ్చర్యపోకండి.
ఇది అల్లు వారి ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘ఆహా’ కోసం ప్లాన్ చేస్తున్న టాక్ షోలో భాగమట. కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో సరిపెట్టకుండా తమ సబ్‌స్క్రైబర్లను మరింత ఎంగేజ్ చేసేందుకు కొన్ని టాక్ షోలను కూడా ‘ఆహా’ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా తమన్నా లాంటి స్టార్ హీరోయిన్‌తో ఒక షోకు రంగం సిద్ధం చేస్తోంది. టాలీవుడ్ సెలబ్రెటీలతో ఇంతకుముందు టీవీల్లో చూసిన వాటికి భిన్నంగా ఈ టాక్ షోను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ షోకు హైప్ తెప్పించడం కోసం తొలి ఎపిసోడ్‌ను రామ్ చరణ్, అల్లు అర్జున్ జోడీలను అతిథులుగా రప్పిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే నిజం అయితే బావ, బావమరుదులు కలయిక ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లలో అనుకోకుండా చరణ్, బన్నీ మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీలో బన్నీ వేరు, మెగా అభిమానుల్లో బన్నీ అభిమానులు వేరు అన్నట్లుగా తయారైంది. ఇంతకుముందులా చరణ్‌తో అంతగా అసోసియేట్ కావడానికి బన్నీ ఇష్టపడట్లేదనిపిస్తోంది.
ఇలాంటి సమయంలో చరణ్‌తో కలిసి బన్నీ ఈ షోలో కనిపించాడంటే దానిపై అందరి దృష్టీ నిలిచి ఉంటుంది. ఈ షోకు ఆటోమేటిగ్గా క్రేజ్ వస్తుంది. అరవింద్ నిజంగా అనుకుంటే వీళ్లిద్దరితో కలిసి షో చేయించడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఈ జోడీని నిజంగానే ‘ఆహా’ షోలో చూస్తామో లేదో చూడాలి మరి.
This post was last modified on June 29, 2020 10:02 am
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…
దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి శుక్రవారంతో 10 మాసాలు గడిచాయి. గత ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి సర్కారుకొలువు…
హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…