ప్రస్తుతం ఒక భాషలో రిలీజైన ట్రైలర్ ని మిగతా భాషలకు చెందిన స్టార్స్ షేర్ చేస్తూ అభినందించడం కామన్ అయిపోయింది. కానీ షేర్ చేసిన వ్యక్తికి థాంక్స్ చెప్పే విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఆ హీరో ఫ్యాన్స్ రంగంలోకి దిగుతారు. తాజాగా అక్షయ్ కుమార్ కి అలాంటిదే జరిగింది. ఇటీవలే అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షా బంధన్’ ట్రైలర్ రిలీజయింది. ఆ ట్రైలర్ ని ట్విట్టర్ లో షేర్ చేసి వాట్టే ట్రైలర్ అంటూ తనకి అనిపించిన ఫీడ్ బ్యాక్ చెప్పాడు రామ్ చరణ్. పనిలో పనిగా ఆ చిత్ర దర్శకుడికి బర్త్ డే విశేష్ కూడా తెలిపాడు చరణ్.
ఇక తాజాగా ఆ ట్వీట్ ని కోట్ చేసి చరణ్ కి అక్షయ్ థాంక్స్ చెప్పాడు. అక్కడి వరకూ అంతా బాగానే ఉంది. కానీ కోట్ చేసిన ట్వీట్ లో రామ్ చరణ్ ని అన్న అంటూ సంభోదించడమే మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది. ఎవరు ఎవరికి అన్న ? ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టావ్ నీకు చరణ్ అన్న నా ? అంటూ అక్షయ్ కి తన వయసు గుర్తుచేస్తూ ఇష్టమొచ్చిన కామెంట్స్ తో రెచ్చిపోయారు మెగా ఫ్యాన్స్. నిజానికి అందులో తప్పేమీ లేదు. క్యాజువల్ గానే అక్షయ్ అలా పెట్టి ఉండొచ్చు. కానీ ఫ్యాన్స్ మాత్రం అక్షయ్ కుమార్ వంటి సీనియర్ హీరో చరణ్ ని అన్న అని సంభోదించడం నచ్చక ఇలా నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారంతే.
ఏదేమైనా RRR తో చరణ్ బాలీవుడ్ కి బాగా దగ్గరయ్యాడు. అక్కడ స్టార్ హీరోలతో దర్శకులతో చాలా క్లోజ్ గా మెలుగుతున్నాడు. త్వరలోనే హిందీలో కూడా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. గతంలో తుఫాన్ అనే సినిమా చేసాక బాలీవుడ్లో గ్యాప్ తీసుకున్న చరణ్ ని మళ్లీ RRR తో సరికొత్తగా చూపించి అక్కడ స్టార్ ని చేశాడు రాజమౌళి.
This post was last modified on June 30, 2022 9:01 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…