మొన్నా మధ్య ప్రభాస్ లుక్ ని నెటిజన్లు బాగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ తన ఫిజిక్ ని గాలికి వదిలేసి బాగా లావు అయ్యాడని మునుపటి చరిష్మా ఆ మొఖంలో కనిపించడం లేదని మీమ్స్ కూడా వేసుకున్నారు.
ఆ తర్వాత ప్రభాస్ తన హెయిర్ ని కవర్ చేస్తూ ఓ బాండ్ పెట్టుకోవడం మీద కూడా గట్టిగానే కామెంట్స్ చేశారు. ఆ లుక్ లో ఉన్న ప్రభాస్ ఫొటోస్ షేర్ చేసి సాయి బాబా గెటప్ కి బాగా సూటవుతాడని ట్రోల్ చేసి పారేశాడు.
ఆ తర్వాత ప్రభాస్ ఆ బాండ్ లేకుండా కనిపించాడు. ఇటివలే తన స్లిమ్ లుక్ వదిలి అందరినీ ఆశ్చర్య పరిచాడు కూడా. హమ్మయ్య ప్రభాస్ ఒకప్పటి లుక్ లోకి వచ్చేసాడని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా అమితాబ్ , రాఘవేంద్ర రావు , నాని , ప్రశాంత్ నీల్ తో కలిసి వైజయంతి కొత్త ఆఫీసులో ప్రభాస్ ఫోటోకి ఫోజిచ్చి మళ్ళీ ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోయాడు.
ఎప్పటిలానే హెయిర్ కి బాండ్ పెట్టుకొని కాస్త లావుగా కనిపించాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ హెయిర్ కి ఏమైంది ? ఎందుకు బాండ్ తో కవర్ చేస్తున్నాడు ? మళ్ళీ లావు అయ్యాడేంటి ? ఇలా ఆడియన్స్ మైండ్ లో చాలానే క్వశ్చన్స్ మొదలవుతున్నాయి.
తరచుగా షూటింగ్స్ కోసం ఫ్లైట్ లో తిరిగే ప్రభాస్ అక్కడ కూడా హెయిర్ బ్యాండ్ తోనే కనిపిస్తుండటంతో రెబల్ ఫ్యాన్స్ కూడా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ మళ్ళీ ‘మిర్చి’ లుక్ లో కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
This post was last modified on June 30, 2022 10:02 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…