కొన్నేళ్లుగా హిట్టు లేకుండా బండి నడిపిస్తున్న హీరోల లిస్టులో ముందు వరుసలో ఉన్నాడు గోపీచంద్. అవును మ్యాచో హీరోకి దాదాపు ఏడెనిమిదేళ్ళుగా సరైన హిట్ లేదు. అప్పుడెప్పుడో జిల్ తో ఓ హిట్టు కొట్టాడు తర్వాత ఎన్ని సినిమాలు తీసినా, ప్రయోగాలు చేసినా హిట్ కొట్టలేకపోయాడు.
నిజానికి ‘సాహసం’ థియేటర్స్ ఆడలేదు కానీ టివీలో బాగానే చూశారు. ఆ తర్వాత ‘ఆక్సిజన్’, ‘పంతం’,’గౌతమ్ నంద’,’చాణక్య’ ఇలా ఎన్ని సినిమాలు చేసిన ఒక్కటి కూడా గోపీచంద్ ని హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. ఆఖరికి ‘సీటిమార్’ కూడా గోపిచంద్ కి ఆశించిన విజయం అందించలేకపోయింది.
అందుకే ఇప్పుడు అన్నీ ఆశలు ‘పక్కా కమర్షియల్’ మీదే పెట్టుకున్నాడు మ్యాచో స్టార్. మారుతి తనని హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చి బౌన్స్ బ్యాక్ చేస్తాడని ఆశిస్తున్నాడు. నిజానికి పక్కా కమర్షియల్ ప్రారంభంలో సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.
‘ప్రతి రోజు పండగే’ వంటి సూపర్ హిట్ తర్వాత మారుతీ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ పరంగా కూడా క్రేజ్ దక్కించుకుంది. కానీ ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో మారుతి ‘మంచి రోజులొచ్చాయి’ అనే నాసిరకం సినిమా చేసి చేయి కాల్చుకున్నాడు. ఆ సినిమా ఘోరంగా అపజయం అందుకుంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పక్కా కమర్షియల్ మీద పడింది.
తాజాగా చిరంజీవి ఈవెంట్ కి రావడంతో కొంత బజ్ వచ్చింది. పైగా మేకర్స్ టికెట్టు ధర బాగా తగ్గించి ఒకప్పటి రెట్లు తీసుకొచ్చారు. ఏ మాత్రం టాక్ బాగున్నా థియేటర్స్ కి జనాలు క్యూ కట్టడం ఖాయం. మారుతీ మార్క్ కామెడీ క్లిక్ అయితే సినిమా మంచి రెవెన్యూ చేయడం పక్కా.
మరి గోపీచంద్ హిట్ కొట్టడానికి అన్ని కలిసొచ్చాయి. మరి ఈ సినిమాతో హిట్ అందుకొని మళ్ళీ తన మార్కెట్ పెంచుకుంటాడా చూడాలి. నెక్స్ట్ శ్రీవాస్ తో గోపీచంద్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఆ సినిమా మార్కెట్ కూడా ఇప్పుడు ‘పక్కా కమర్షియల్’ మీద ఆధారపడి ఉంది.
This post was last modified on June 29, 2022 9:29 pm
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…