‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న విడుదలై నెల పాటు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తీరు ఒకెత్తయితే.. థియేట్రికల్ రన్ అంతా అయిపోయాక అది రేపిన సంచలనం మరో ఎత్తు. నెట్ ఫ్లిక్స్‌లో రిలీజయ్యాక హిందీ వెర్షన్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపింది. ముఖ్యంగా హాలీవుడ్ ఫిలిం మేకర్స్, అక్కడి ప్రేక్షకులు ఈ సినిమా చూసి ఎంత ఫిదా అయిపోయారో, ఎంత ఎగ్జైట్ అయ్యారో రెండు నెలలుగా చూస్తూనే ఉన్నాం.
ఈ స్పందన చూసి ‘ఆర్ఆర్ఆర్’ను మళ్లీ యుఎస్‌లో రీరిలీజ్ చేస్తే.. నేటివ్ అమెరికన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చారు. మనం మన స్టార్ల సినిమాలను చూసి ఎగ్జైట్ అయినట్లు థియేటర్లలో గోల గోల చేశారు. ‘బాహుబలి’కి సైతం ఇలాంటి స్పందన లేదు. ‘ఆర్ఆర్ఆర్’ వాళ్లకు అంతగా పిచ్చెక్కించేసింది. చాలామంది వెరివైడ్ ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్న సెలబ్రెటీలు తమ జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదని పేర్కొనడం గమనార్హం.
ఇలా ‘ఆర్ఆర్ఆర్’ అమెరికన్స్ సహా అంతర్జాతీయ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ ఇంకా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. ఈ మధ్య యుఎస్ఏ టుడే అనే ప్రముఖ మీడియా సంస్థ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ పరంగా హాలీవుడ్ చిత్రాలను పక్కన పెట్టి ‘ఆర్ఆర్ఆర్’కు అగ్ర స్థానాన్ని ఇవ్వడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మరో ఘనత సాధించింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మిడ్ సీజన్ అవార్డులకు నామినేట్ అయింది. హెచ్‌సీఏ నామినేషన్లను హాలీవుడ్ సినిమాలు కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. ఈ జాబితాలో ఓ ఇండియన్ సినిమాకు ఇంత వరకు ఎప్పుడూ నామినేషన్ దక్కలేదు. ఈ ఏడాది టాప్ గన్ మావెరిక్, బ్యాట్ మన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ లాంటి ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రాలు హెచ్‌సీఏ బెస్ట్ ఫిలిం అవార్డు కోసం నామినేట్ అయ్యాయి. వాటి సరసన ఆర్ఆర్ఆర్ చోటు సంపాదించడం గొప్ప ఘనతే. ఇలాంటి ‘ఆర్ఆర్ఆర్’ సంచలనాలు ఇంకెన్ని చూస్తామో చూడాలి.
This post was last modified on June 29, 2022 3:39 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…