Movie News

థియేటర్లలో తుస్.. ఓటీటీలో భేష్

అజయ్ దేవగణ్ బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడు. కరోనాకు ముందు విడుదలైన అజయ్ చివరి సినిమా ‘తానాజీ’ 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమాతో ఆయన మార్కెట్ అమాంతం పెరిగింది. దీంతో తర్వాత చేయబోయే సినిమాకు అది బాగా కలిసొస్తుందని అనుకున్నారు. అందుకేనేమో.. తర్వాతి చిత్రాన్ని వేరే వాళ్లకు చేయకుండా స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో ‘రన్ వే 34’ను రూపొందించాడు.

ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ ఎయిర్ థ్రిల్లర్.. రెండు నెలల కిందట థియేటర్లలోకి దిగింది. సినిమాకు మంచి రివ్యూలొచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగుంది. కానీ వసూళ్లలో మాత్రం అది ప్రతిఫలించలేదు. తొలి రోజు మూడున్నర కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించిన ఈ చిత్రం.. ఫుల్ రన్లో రూ.20 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. చాన్నాళ్లు ఎదురు చూసి థియేటర్లలో రిలీజ్ చేస్తే ఇలాంటి ఫలితం వచ్చేసరికి అజయ్ అండ్ టీం షాకైపోయింది.

ఐతే ఈ మధ్య చాలా హిందీ సినిమాల విషయంలో జరుగుతున్నదేంటంటే.. థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీల్లో మాత్రం గొప్ప ఆదరణ దక్కుతోంది. ‘రన్ వే 34’ కూడా ఆ జాబితాలోనే చేరింది. అమేజాన్ ప్రైమ్‌లో ముందు ఈ చిత్రాన్ని రెంట్ ఆప్షన్‌తో రిలీజ్ చేశారు. కొన్ని వారాల తర్వాత ఫ్రీగా సబ్‌స్క్రైబర్లందరికీ చూసే అవకాశం కల్పించారు. అప్పట్నుంచి ‘రన్ వే 34’కు రెస్పాన్స్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఓ కొత్త సినిమా రిలీజైనట్లు దీని గురించి పోస్టులు పెడుతున్నారు. రిలీజైన దగ్గర్నుంచి ప్రైమ్‌లో ఇదే నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. అందులో సినిమా చూసిన వాళ్లు థియేటర్లలో ఎందుకు ఆడలేదో అని ఆశ్చర్యపోతున్నారు.

క్రేజీ, మాస్ కంటెంట్ ఉంటేనే ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ టైంలో పట్టించుకోకపోవడం.. సినిమా ఏదో నామమాత్రంగా ఆడేసి ఓటీటీల్లోకి వచ్చాక చూసి ఈ సినిమా భలే ఉందే సోషల్ మీడియాలో కొనియాడడం మామూలైపోయింది. తెలుగులో ఈ మధ్య ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం విషయంలోనూ ఇలాంటి స్పందనే కనిపించింది.

This post was last modified on June 29, 2022 10:49 am

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

2 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

11 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

11 hours ago