ఒకప్పుడైనా, ఇప్పుడైనా ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సినీ రంగంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఈ జాబితాలో చాలా తక్కువమందే కనిపిస్తారు. ఈ మధ్య కాలంలో ఇలా వచ్చి నిలబడ్డ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. అతడి తొలి సినిమా ‘రాజా వారు రాణి వారు’ థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో మంచి స్పందన తెచ్చుకుని అతడికి పేరు తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత తనే రచయితగా మారి, మేకింగ్ విషయంలోనూ అన్నీ తానై వ్యవహరిస్తూ చేసిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ యువత దృష్టిని బాగానే ఆకర్షించింది. సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోయినా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుని కిరణ్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ను చాటిచెప్పింది. ఈ సినిమా సాధించిన సక్సెస్ చూసే గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లు అతడికి అవకాశాలు ఇచ్చాయి. తాజాగా కిరణ్ నుంచి ‘సమ్మతమే’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ రిలీజ్ చేయడం విశేషం.
ఐతే ‘సమ్మతమే’కు, అంతకుముందు ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’కు ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. ఇవి రెండూ ప్రేక్షకులను సంతృప్తిపరచలేకపోయాయి. బ్యాగ్రౌండ్ లేకుండా, చిన్న సినిమాతో హీరో అయిన కిరణ్‌కు ఈ మాత్రం ఓపెనింగ్స్ వస్తున్నాయంటే గొప్ప విషయమే.
అతడిలో టాలెంట్ ఉంది, యూత్‌కు అతను బాగా కనెక్ట్ అవుతున్నాడన్నది వాస్తవం. కానీ కథల ఎంపికలో అతడి జడ్జిమెంటే బాగా లేదన్నది అందరూ అంటున్న మాట. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ కాన్సెప్ట్, కొన్ని ఎపిసోడ్ల వరకు బాగున్నా.. మొత్తంగా ఆ సినిమాను సరిగా డీల్ చేయలేదు. ఇక తర్వాత కిరణ్ చేసిన ‘సెబాస్టియన్’ అయితే మరీ పేలవమైన సినిమా.
‘సమ్మతమే’ కూడా కొంత వరకు బాగున్నా.. మొత్తంగా చూస్తే బలమైన కంటెంట్ ఉన్న చిత్రం కాదు. ఎక్కువగా అనుభవం లేని దర్శకులు, నిర్మాతలతో పని చేస్తున్న కిరణ్‌కు.. సరైన గైడెన్స్ కరవవుతోందన్నది స్పష్టం. ఐతే ఇప్పుడు గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లలో చేస్తున్నాడు కాబట్టి అతడికి ఆ గైడెన్స్ దొరుకుతుందనే ఆశిద్దాం. అడివి శేష్ లాగా రైటింగ్ టాలెంట్ కూడా ఉన్న ఈ యంగ్ హీరో.. కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తే స్టార్ అయ్యే లక్షణాలున్నాయి. మరి చేతిలో ఉన్న అవకాశాలను అతను ఎంతమేర ఉపయోగించుకుంటాడో చూడాలి.
This post was last modified on June 28, 2022 7:41 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్‌లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…