ఇటీవల ‘చోర్ బజార్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా బండ్ల గణేష్ స్పీచ్ ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. తనకు సన్నిహితుడే అయిన పూరి జగన్నాథ్ మీద బండ్ల గట్టి పంచులే వేశాడు. చాలామంది హీరోలను స్టార్లను చేసి, వాళ్లకు బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన పూరి.. తన కొడుకు సినిమా ఈవెంట్‌కు రాకపోవడాన్ని బండ్ల తప్పుబట్టాడు. ఆకాష్ పెద్ద హీరో అయ్యాక తన తండ్రికే డేట్లు ఇవ్వకూడదని షరతులు కూడా పెట్టాడు.
ఈ వ్యాఖ్యల్లో పూరి కొడుకు మీద ప్రేమ కనిపించినప్పటికీ.. బండ్ల కాస్త అదుపు తప్పాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. డైలాగ్ చెప్పడం రాని, డ్యాన్స్ చేయడం రాని హీరోలకు పూరి హిట్లిచ్చాడని.. వాళ్లెవ్వరూ పూరి కొడుకును ప్రమోట్ చేయడానికి రాలేదని అసహనం వ్యక్తం చేయడం వివాదాస్పదం అయింది. అలాగే ర్యాంపులు, వ్యాంపులు పూరి చుట్టూ తిరుగుతున్నారని పరోక్షంగా కౌంటర్లు వేయడం కూడా చర్చకు దారి తీసింది.
ఈ వ్యాఖ్యలపై ఇప్పటిదాకా ఏమీ స్పందించని పూరి.. కొంచెం గ్యాప్ తీసుకుని పరోక్షంగా బండ్ల మీద కౌంటర్ వేసినట్లుగా భావిస్తున్నారు. గతంలో ‘నాలుక’ అనే టాపిక్ మీద పాడ్‌కాస్ట్ చేసిన పూరి.. అనవసరంగా మాట్లాడకూడదని, దాని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని, మన కుటుంబ సభ్యుల దగ్గర కూడా నాలుకను ఎక్కువ వాడకూడదని.. మాట్లాడ్డం కంటే వినడం ద్వారా చాలా ప్రయోజనం ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు అదే పాడ్‌కాస్ట్‌ను పూరి తిరిగి యూట్యూబ్‌లో షేర్ చేయడం.. బండ్లకు కౌంటర్ ఇవ్వడానికే అని భావిస్తున్నారు.
ఐతే పూరి ఈ పని చేసిన కాసేపటికే బండ్ల.. ఒక పోస్ట్ పెట్టాడు. ‘‘నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవాడు ఓడపోతూనే ఉంటాడు’’ అంటూ ఒక కోట్‌ను బండ్ల షేర్ చేశాడు. ఇది కచ్చితంగా పూరి పాడ్‌కాస్ట్‌కు కౌంటరే అని భావిస్తున్నారు. తాను చాలామందిలా నటిస్తూ మౌనంగా ఉండలేనని, ఓపెన్‌గా వాస్తవాలు మాట్లాడేస్తానని, తన లాంటి వాళ్లకు చివరికి చెడు అవుతారని బండ్ల చెప్పకనే చెప్పినట్లుగా అనిపిస్తోంది.
This post was last modified on June 27, 2022 6:30 pm
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…