Movie News

సల్మాన్ నోట ‘ఊ అంటావా’

దక్షిణాది పాటల రీచ్ చూసి ఇప్పుడు ఒక్కొక్కరికి దిమ్మదిరిగిపోతోంది. ఇంటర్నెట్ విప్లవాన్ని సరిగ్గా ఉపయోగించుకుని మన పాటలను ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోతున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్లు. గత కొన్నేళ్లలో వచ్చిండే, బుట్టబొమ్మా, సామజవరగమనా, సారంగ దరియా, రౌడీ బేబీ లాంటి పాటలు ఇంటర్నెట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. వాటికి యూట్యూబ్‌లో ఎంత భారీ వ్యూస్, లైక్స్ వచ్చాయో తెలిసిందే. ఇక గత కొన్ని నెలల్లో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయిన పాటల్లో ‘ఊ అంటావా’ ఒకటి.

ముందు విన్నపుడు ఈ పాట మామూలుగానే అనిపించింది కానీ.. తర్వాత తర్వాత అది జనాలకు పిచ్చెక్కించేసింది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఆ పాటను హమ్ చేయడం, ఆ ట్యూన్‌కు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. హిందీలోనూ ‘పుష్ప’ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ పాట రీచ్ అసాధారణ స్థాయికి చేరుకుంది.

ఉత్తరాదిన సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరికీ ‘ఊ అంటావా’ పిచ్చి ఎక్కేసింది. చివరికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం ‘ఊ అంటావా’ మాయలో పడిపోవడం విశేషం. తాజాగా ఓ అవార్డుల వేడుక సందర్భంగా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన, ఇన్‌స్పైర్ చేసిన పాట ఏది అని సల్మాన్‌ ఖాన్‌ను అడిగితే.. మరో ఆలోచన లేకుండా ‘ఊ అంటావా’ అని హమ్ చేశాడు సల్మాన్.

ఇలా ఓ తెలుగు పాట లిరిక్ బాలీవుడ్ సూపర్ స్టార్ నోటి నుంచి వినిపించడం.. ఈ పాట ఆయన ఫేవరెట్‌గా మారడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీన్ని బట్టే ఈ పాట ఏ స్థాయిలో హిట్టయిందో అర్థం చేసుకోవచ్చు. సల్మాన్ నోట తన పాట వినిపించేసరికి సమంత కూడా ఎగ్జైట్ అయింది. ట్విటర్లో ఈ పోస్టుకు బదులుగా లవ్ ఇమోజీలు పెట్టి తన ఆనందాన్ని పంచుకుంది. ‘పుష్ప-2’లో కూడా ఇలాంటి పాట ఒకటి పడితే ఆ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయం.

This post was last modified on June 27, 2022 6:24 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

5 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

7 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

7 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

7 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

11 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

11 hours ago