హీరోయిన్లు మంచి వయసులో ఉండగా.. ఫిలిం కెరీర్ మంచి ఊపు మీద ఉండగా.. పెళ్లి గురించే ఆలోచించరు అసలు. చాలామంది హీరోయిన్లు 30 ప్లస్ వయసులో, కెరీర్ చరమాంకానికి వచ్చాక, గ్లామర్ రోల్స్ తగ్గిపోయాక పెళ్లి వైపు అడుగులు వేస్తుంటారు. కొందరు హీరోయిన్లయితే కెరీర్ కోసం పెళ్లికి పూర్తిగా దూరమవుతుంటారు కూడా. హీరోయిన్ల కెరీర్ స్పానే తక్కువ కాబట్టి వాళ్ల ఈ ఆలోచనను తప్పుబట్టలేం. పెళ్లి విషయంలోనే ఇలా ఉండేవాళ్లు ఇక పిల్లల గురించి ఆలోచించడం అంటే చాలా కష్టం. పెళ్లి చేసుకున్నాక కూడా పిల్లల విషయంలో చాలా ఏళ్లు ఆగుతుంటారు.
కొందరేమో ప్రెగ్నెన్సీ కారణంగా తమ గ్లామర్ ఎక్కడ దెబ్బ తింటుందో అని, ఆ నొప్పులు భరించలేమో అని సరోగసీ పద్ధతిలో పిల్లల్ని కనే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఎవరి ఛాయిస్ వాళ్లది కాబట్టి ఈ విషయంలోనూ తప్పులు ఎంచలేం. కానీ ఇలాంటి వాళ్లందరికీ తాను భిన్నమని చాటింది ఆలియా భట్.
రణబీర్ కపూర్ అంటే ఆమెకు ఎంతిష్టమో అందరికీ తెలుసు. అతడి ప్రేమలో పడ్డాక ఆమెలో చాలా మార్పు చూశారు చాలామంది. బహిరంగ వేదికల్లో కూడా తన మీద ప్రేమను దాచుకునేది కాదు. రణబీర్ మీద ఆరాధన భావం తన కళ్లలో, తన చర్యల్లో స్పష్టంగా కనిపించేది. ఒక మామూలు అమ్మాయిలా అతడిని ఆరాధించిన ఆలియా.. తనను పెళ్లి చేసుకోవాలన్న కలను ఈ మధ్యే నెరవేర్చుకుంది. మామూలుగా హీరో హీరోయిన్లెవరికైనా పెళ్లి అయిందంటే కొన్ని నెలల తర్వాత నుంచి ప్రెగ్నెన్సీపై మీడియా నుంచి ప్రశ్నలు మొదలైపోతుంటాయి. కానీ ఆలియా, రణబీర్ వాళ్లకు ఆ ఛాన్సే ఇవ్వలేదు. పెళ్లయి రెండు నెలలు తిరగ్గానే శుభవార్త చెప్పేశారు. బహుశా ఒక హీరోయిన్ పెళ్లయ్యాక ఇంత వేగంగా గర్భం ధరించడం ఒక రికార్డు కావచ్చేమో.
ఇండియాలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతూ, మంచి వయసులో ఉండి, కెరీర్ మంచి ఊపులో ఉండగా.. ఆలియా బిడ్డను కనేందుకు సిద్ధపడడం చాలామంది మింగుడుపడడం లేదు. కానీ కెరీర్ కంటే కూడా బిడ్డకు జన్మనివ్వడం ముఖ్యమని, మాతృత్వాన్ని ఆస్వాదించాలని ఆలియా డిసైడైనట్లు ఉంది. కెరీర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా తాను చాలా స్పెషల్ అని చాటిచెప్పింది ఆలియా.
This post was last modified on June 27, 2022 6:17 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…