భారతీయ థియేటర్లలో బొమ్మ పడి వంద రోజులు దాటిపోయింది. ఇంకో వంద రోజుల పాటు థియేటర్లు తెరుచుకోకపోయినా ఆశ్చర్యం లేదు. ఐతే ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని దేశాల్లో దశల వారీగా థియేటర్లను తెరుస్తున్నారు. నెల కిందటే కోవిడ్ ఫ్రీ కంట్రీగా మారిన న్యూజిలాండ్‌లో ఇప్పటికే థియేటర్లు తెరుచుకున్నాయి. పక్కనే ఉన్న ఆస్ట్రేలియాలో కూడా కరోనా ప్రభావం బాగా తగ్గడంతో థియేటర్లను పున:ప్రారంభించారు.
ఈ రెండు దేశాల్లో ఇండియన్ సినిమాలకు బాగా గిరాకీ ఉంటుంది. గత కొన్నేళ్లలో మన సినిమాలు ఆ దేశాల్లో ఇరగాడేశాయి. మిలియన్ల కొద్దీ వసూళ్లు రాబట్టాయి. ఆ దేశాల్లోని భారతీయ ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వెళ్లి సినిమా వినోదంలో మునిగి తేలాలనుకుంటున్నారు. కానీ కొత్త సినిమాలు ఏవీ అక్కడ రిలీజ్ చేసే పరిస్థితి లేదు. దీంతో పాత చిత్రాల్నే థియేటర్లలోకి దింపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
బాలీవుడ్ల్ మాస్ ఎంటర్టైన్మెంట్‌కు పెట్టింది పేరు రోహిత్ శెట్టి సినిమాలు. అతడి సినిమాలకు థియేటర్లలో సందడి మామూలుగా ఉండదు. ఇప్పుడు లాక్ డౌన్‌కు బ్రేక్ వేసి థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి అతడి సినిమాలు రెడీ అవుతున్నాయి. ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో రోహిత్ బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ ‘గోల్‌మాల్ అగైన్’ రిలీజ్ అవుతుండగా.. న్యూజిలాండ్‌లో అతడి మరో బ్లాక్‌బస్టర్ ‘సింబా’ (టెంపర్ రీమేక్) రిలీజ్ కాబోతోంది.
వీటికి వచ్చే స్పందనను బట్టి మరిన్ని సినిమాలను ఈ రెండు దేశాల్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేరే భాషల్లో కూడా కొత్త సిినిమాలు ఏ దేశంలోనూ ఇప్పుడు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. కరోనా భయం పూర్తిగా తొలగిపోయే వరకు ఇలా పాత సినిమాల్ని నడిపించుకోవాల్సిందే. క్రిస్టోఫర్ నోలన్ కొత్త చిత్రం ‘టెనెట్’ను ముందు ఈ నెలలోనే విడుదల చేయాలనుకున్నారు. తర్వాత రెండుసార్లు డేట్లు మార్చారు.
This post was last modified on June 29, 2020 10:25 am
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…