ఒక మంచి హిట్ ఇచ్చాక ఒక స్టార్ డైరెక్టర్ మూడేళ్లకు పైగా సినిమా చేయకుండా ఖాళీగా ఉండడం అరుదైన విషయం. కానీ హరీష్ శంకర్ ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. చివరగా అతడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’ హిట్టయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఫామ్ చాటుకోవడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది హరీష్‌కు.
తన అభిమాన హీరోను మళ్లీ డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో హరీష్ ఆనందం అంతా ఇంతా కాదు. ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ రిపీటవుతుండటంతో అభిమానుల ఆనందానికి కూడా అవధుల్లేవు. కానీ పవన్ కళ్యాణ్ వేరే కమిట్మెంట్ల వల్ల ఈ సినిమా ఎంతకీ పట్టాలెక్కడం లేదు. ఇదిగో అదిగో అనుకుంటూనే ఏళ్లు తగడిచిపోతున్నాయి. పవన్‌తో మళ్లీ ‘గబ్బర్ సింగ్’ స్థాయి హిట్టే తీయాలన్న సంకల్పంతో హరీష్.. వేరే సినిమా ఏదీ ఒప్పుకోకుండా ఓపిగ్గా ఎదురు చూశాడు.
కానీ ఎంతకీ క్లారిటీ రాకపోవడం, రాబోయే కొన్ని నెలల్లో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు కనిపించకపోవడంతో వేరే ప్రాజెక్టు మీద దృష్టిపెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. హరీష్.. రామ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. హరీష్ సినిమా చేద్దామన్నా వేరే స్టార్ హీరోలెవ్వరూ ఖాళీగా లేరు. ప్రతి ఒక్కరూ రెండు మూడు కమిట్మెంట్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. రామ్ మాత్రం బోయపాటి సినిమా మినహా ఇంకే సినిమాకూ ఓకే చెప్పలేదు. ఐతే రామ్‌తో హరీష్ వెంటనే సినిమా మొదలుపెట్టే సూచనలేమీ లేవు.
ఇద్దరి కాంబినేషన్ ఓకే అనుకుంటే.. ఆ చిత్రానికి స్క్రిప్టు రెడీ చేసుకోవాలని హరీష్ చూస్తున్నాడు. అదయ్యేలోపు పవన్ సినిమా సెట్స్ మీదికి వెళ్తే ఓకే. లేదంటే రామ్ సినిమాను పూర్తి చేసి, ఆ తర్వాత పవన్ సినిమా మీదికి వెళ్లాలని హరీష్ చూస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ సినిమాను నమ్ముకుని ఇప్పటికే చాలా సమయం వృథా చేసుకున్న హరీష్.. ఇప్పుడిలా ఆలోచించడంలో తప్పేమీ లేదనే చెప్పాలి.
This post was last modified on June 27, 2022 1:25 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…