పనిలేని హీరోయిన్లు ‘మేం రెడీ’ అంటున్నారు!

లీడింగ్ లో ఉన్న హీరోయిన్లు షూటింగ్ కి రావడానికి ససేమీరా అనేస్తున్నారు. కరోనా కేసులు దేశమంతటా విజృంభిస్తుండగా, హీరోయిన్లు షూటింగ్ చేయడానికి జంకుతున్నారు.

షూటింగ్ ఎప్పట్నించి మొదలు పెట్టొచ్చనే ఒక అంచనా కోసం కొందరు ప్రొడ్యూసర్లు తమ హీరోయిన్లకు కాల్ చేయగా, ‘ఇప్పుడు షూటింగ్ ఏంటి సర్’ అన్న వాళ్లే ఎక్కువట. క్రేజ్ ఉంది కనుక సదరు హీరోయిన్లు ఏం చెప్తే అదే చెల్లుతుంది.

కానీ కొంత కాలంగా పని లేకుండా ఖాళీగా ఉన్న హీరోయిన్లు ఇప్పుడు ఎవరు పిలిచి పని ఇచ్చినా చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. డిమాండ్ అధికంగా ఉంది కనుక ఇప్పుడు కొన్ని అవకాశాలు వస్తాయని తమ మేనేజర్లను అలర్ట్ చేసి పెట్టారు.

కానీ పాపం వాళ్ళ దురదృష్టం కొద్దీ హీరోలెవరూ ఇప్పుడు షూటింగ్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక హీరోలు లేకుండా హీరోయిన్ అందుబాటులో ఉండి ఉపయోగం ఏమిటి? అందుకే పాపం వాళ్ళు రెడీగా ఉన్నా వర్క్ లేదిప్పుడు.

All the Streaming/OTT Updates you ever want. In One Place!