Movie News

బాలీవుడ్‌కు ఇంకో రిలీఫ్‌

కొవిడ్ కొట్టిన దెబ్బ‌కు మామూలుగా కుదేల‌వ్వ‌లేదు బాలీవుడ్. దాదాపు ఏడాదిన్న‌ర పాటు ఉత్త‌రాదిన మెజారిటీ థియేట‌ర్లు మూత‌ప‌డి ఉండ‌డంతో బాలీవుడ్ వేల కోట్ల ఆదాయం కోల్పోయింది. థియేట‌ర్లు పునఃప్రారంభ‌మ‌య్యేస‌రికి ప్రేక్ష‌కుల మైండ్ సెట్ మారిపోయి సినిమా బాగున్నా కూడా థియేట‌ర్ల‌కు రాని ప‌రిస్థితి త‌లెత్తింది.

క‌రోనా టైంలో మాగ్జిమం ఎంట‌ర్టైన్మెంట్ ఇచ్చే ద‌క్షిణాది చిత్రాల‌కు అల‌వాటు ప‌డిపోయి.. హిందీ సినిమాలు వారికి రుచించని ప‌రిస్థితి త‌లెత్తింది. ఎప్పుడో ఓ సినిమా మాత్ర‌మే బాగా ఆడుతోంది త‌ప్ప‌.. చాలా వ‌ర‌కు హిందీ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొడుతున్నాయి. కొత్త ఏడాదిలో క‌శ్మీర్ ఫైల్స్, భూల్ భులాయియా-2 మిన‌హాయిస్తే హిట్లే లేవు. పెద్ద హీరోలు న‌టించి, మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఆడ‌క‌పోవ‌డం బాలీవుడ్‌ను బెంబేలెత్తించింది. ఈ నేప‌థ్యంలో ఈ వీకెండ్లో వ‌చ్చిన జ‌గ్ జ‌గ్ జీయో మీద అంద‌రి దృష్టీ నిలిచింది.

వ‌రుణ్ ధావ‌న్‌, కియారా అద్వానీ, అనిల్ క‌పూర్, నీతూ క‌పూర్ లాంటి పేరున్న తారాగ‌ణం న‌టించిన ఈ చిత్రం ట్రైల‌ర్‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ లాగా క‌నిపించిన ఈ చిత్రానికి ప్రి రిలీజ్ హైప్ బాగానే క‌లిసొచ్చింది. అజ‌య్ దేవ‌గ‌ణ్ లాంటి స్టార్ న‌టించి, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ర‌న్ వే 34కు తొలి రోజు మూడున్నర కోట్ల నెట్ వ‌సూళ్లు మాత్ర‌మే రాగా.. జ‌గ్ జ‌గ్ జీయో రూ.9.5 కోట్లు వ‌సూలు చేయ‌డం విశేషం. ఈ ఊపును రెండో రోజు కూడా ఈ చిత్రం కొన‌సాగించింది.

శ‌నివారం రూ.12 కోట్ల‌కు పైగా నెట్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఆదివారం కూడా ఇదే స్థాయిలో లేదా ఇంత‌కంటే మించి క‌లెక్ష‌న్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఈ మిడ్ రేంజ్ మూవీకి వీకెండ్లో రూ.30 కోట్ల‌కు పైగా నెట్ వ‌సూళ్లు వ‌చ్చాయంటే హిట్ స్టేట‌స్ అందుకోబోతున్నట్లే. కాక‌పోతే ఈ సినిమా క్లాస్, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను మాత్ర‌మే ఆకర్షిస్తోంది. మాస్ ప్రేక్ష‌కులు మాత్రం ఇంకా భూల్ భులాయియా-2 చూసేందుకే మొగ్గు చూపుతున్నారు.

This post was last modified on June 26, 2022 10:24 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

5 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

7 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

7 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

7 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

11 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

11 hours ago