మనసానమః అని ఒక చిన్న షార్ట్ ఫిలిం. కేవలం 16 నిమిషాల నిడివి ఉంటుందంతే. కొన్నేళ్ల కిందట యూట్యూబ్‌లోకి వచ్చిన ఈ షార్ట్.. యువ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని అనూహ్యమైన ఆదరణ తెచ్చుకుంది. ఐతే కేవలం ప్రేక్షకాదరణతో సంతృప్తి చెందడం కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ షార్ట్ ఫిలిం మీద అవార్డుల వర్షం కురిసింది. అవార్డులంటే ఐదో పదో ఇరవయ్యో ముప్పయ్యో కాదు.. 500 దాటిపోయాయి.
గత కొన్నేళ్లలో అధికారికంగా 513 అవార్డులు గెలుచుకున్న మనసానమః షార్ట్ ఫిలిం ఆస్కార్ అవార్డుల రేసులో కూడా నిలవడం విశేషం. అక్కడ సక్సెస్ కాకపోయినా.. ఇప్పుడీ షార్ట్ ఫిలిం అరుదైన ఘనత సాధించింది. అత్యధిక అవార్డులు గెలుచుకున్న షార్ట్ ఫిలింగా దీన్ని గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించడం విశేషం.
తాజాగా ఈ షార్ట్ ఫిలిం రూపకర్త దీపక్.. గిన్నిస్ బుక్ నుంచి సర్టిఫికెట్ కూడా అందుకున్నాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ షార్ట్ చాలా సింపల్‌గా ఉంటుంది. కథాంశం కొత్తదేమీ కాదు. ప్రేమ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ అమ్మాయిల కన్ఫ్యూజన్లో ఉంటారని.. వాళ్లను డీల్ చేయడం చాలా కష్టమని చెబుతూ.. అబ్బాయి కోణంలో ఆసక్తికరంగా కథను చెప్పే ప్రయత్నం చేశాడు దీపక్.
నరేషన్ చాలా ట్రెండీగా.. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇదొక చిన్న షార్ట్ ఫిలిమే అయినా సంగీతం, ఛాయాగ్రహణం, ఎఫెక్ట్స్ మంచి క్వాలిటీతో ఉంటాయి. యూత్‌కు బాగా నచ్చేలా, ట్రెండీగా ఉన్న ఈ షార్ట్.. తెలుగులో సక్సెస్ అయ్యాక పలు భాషల్లో అనువాదం అయింది. అన్ని చోట్లా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐతే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దీనికి ఇన్ని అవార్డులు రావడం, గిన్నిస్ బుక్ సైతం దీన్ని గుర్తించడం విశేషమే.
This post was last modified on June 26, 2022 10:20 pm
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…