Movie News

డీజే బాబుపై మామూలు ప్రెజర్ కాదు

ఈ ఏడాది చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయం సాధించిన చిత్రం ‘డీజే టిల్లు’. పెట్టుబడి మీద కొన్ని రెట్ల లాభాన్ని తెచ్చి పెట్టిందా చిత్రం. నిజానికి ఈ సినిమాకు అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. రివ్యూలన్నీ మిక్స్‌డ్‌గా వచ్చాయి. అయినా ఈ చిత్రం నెగెటివిటీని అధిగమించి బ్లాక్‌బస్టర్ అయింది. యూత్‌కు ఈ చిత్రంలోని డీజే టిల్లు క్యారెక్టర్ మామూలుగా ఎక్కలేదు. సిద్ధు జొన్నలగొడ్డ ఒక్కసారిగా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.

సినిమా రిలీజ్ తర్వాత ఈ పాత్ర జనాల గుండెల్లోకి దూసుకెళ్లిపోయింది. యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో డీజే టిల్లు ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా, క్యారెక్టర్ రీచ్ చూసి సిద్ధు అండ్ టీం ఈ సినిమాకు సీక్వెల్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇందుకోసం సిద్ధు కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాడు.

టిల్లు క్యారెక్టర్ తర్వాత మరే పాత్ర చేసినా.. జనాలకు ఆనదని, ప్రేక్షకుల్లో ఆ హ్యాంగోవర్ అలాగే కంటిన్యూ అవ్వాలని, మళ్లీ టిల్లు పాత్రతోనే వాళ్లను పలకరించాలని డిసైడయ్యాడు. అందుకే ‘కప్పెల’ రీమేక్‌తో పాటు తాను ఒప్పుకున్న మరో చిత్రాన్ని కూడా వదులుకున్నాడు. ఈ క్రమంలో ఆయా చిత్ర బృందాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా తగ్గలేదు. పూర్తిగా తన దృష్టంతా ‘డీజే టిల్లు-2’ మీదే పెట్టాడు. మొత్తానికి కష్టపడి పార్ట్-2కు స్క్రిప్టు రెడీ చేశాడు. త్వరలోనే షూటింగ్‌కు వెళ్లబోతోంది సిద్ధు అండ్ టీం. ఐతే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగబోతున్న నేపథ్యంలో వాటిని అందుకోవడం సిద్ధుకు అంత తేలిక కాదు.

డీజే టిల్లు మామూలుగానే విడుదలై.. రిలీజ్ తర్వాత క్యారెక్టర్ జనాలకు బాగా ఎక్కేసి బ్లాక్‌బస్టర్ అయిపోయింది. ఏ అంచనాలు లేకుండా ఓపెన్ మైండ్‌తో థియేటర్లకు వెళ్లి సర్ప్రైజ్ అయ్యారు ఆడియన్స్. కానీ ఈసారి చాలా అంచనాలు పెట్టుకుని, ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మైంట్ ఆశిస్తూ థియేటర్లలోకి అడుగు పెడతారు. వాళ్లను సంతృప్తిపరచడం ఈజీ కాదు. సిద్ధు అండ్ కోకు ఇది చాలా పెద్ద టాస్కే. రెండు సినిమాలు వదులుకుని మరీ ఈ చిత్రానికే అంకితమైన సిద్ధు.. ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉండే ఉంటాడు. మరి ఈ స్థితిలో అతనెలాంటి సినిమాను డెలివర్ చేస్తాడో చూడాలి.

This post was last modified on June 26, 2022 1:15 pm

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

4 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

5 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

6 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

10 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

10 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

12 hours ago