సినీ పరిశ్రమలో కరోనా తెచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. సినిమాల రిలీజ్ డేట్లు మారడం అన్నది చాలా మామూలు విషయం అయిపోయింది. ఒకప్పుడు సినిమాను వాయిదా వేస్తే అదో పాపం అన్నట్లు చూసేవాళ్లు. పెద్ద సినిమాలు రిలీజైనపుడు అభిమానులు గగ్గోలు పెట్టేవాళ్లు. ఇప్పుడు ఆ ధోరణి మారిపోయింది. డేట్ మారుస్తుంటే.. సినిమాను వాయిదా వస్తుంటే లైట్ తీసుకుంటున్నారు అందరూ. ఒక డేట్‌కు కట్టుబడి సినిమా రిలీజ్ చేస్తున్న వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తున్నారు.
జులైలో రాబోయే సినిమాలన్నీ ఇంతకుముందు ఒక డేట్ అనుకుని తర్వాత మార్చుకున్నవే. కాగా ఈ డేట్ ఫైనల్ అనుకున్నాక కూడా మళ్లీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జులై 8కి విడుదల కావల్సిన అక్కినేని నాగచైతన్య సినిమా ‘థ్యాంక్ యు’ రెండు వారాలు వెనక్కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మార్పు కారణంగా మరో చిత్రం విడుదల తేదీ మారింది. ఆ చిత్రమే.. హ్యాపీ బర్త్‌డే.
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ‘మత్తు వదలరా’ దర్శకుడు రితేష్ రాణా రూపొందించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. ఇటీవలే క్రేజీ ప్రోమోలతో ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని ముందు జులై 15కు ఫిక్స్ చేశారు. కానీ ‘థ్యాంక్ యు’ రెండు వారాలు వెనక్కి వెళ్లడంతో ఖాళీ అయిన జులై 8వ తేదీకి ఈ చిత్రాన్ని మార్చేశారు. ఇలా సినిమాలు ప్రిపోన్ కావడం కూడా అప్పుడప్పుడూ జరుగుతుంటుంది.
జులై 1కి అనుకున్న ‘విరాటపర్వం’ సినిమాను ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఖాళీ చేసిన జూన్ 17కు ఫిక్స్ చేయడం తెలిసిందే. ‘హ్యాపీ బర్త్‌డే’ ఫస్ట్ కాపీతో రెడీగా ఉండడం, జులై 14న రామ్ సినిమా ‘వారియర్’ వస్తుండటం వల్ల తమ చిత్రానికి ఇబ్బంది ఉంటుందని భావించడంతో డేట్ మార్చినట్లున్నారు. జులై 8కి మరే చిత్రం బరిలో లేకపోవడం దీనికి కలిసొచ్చేదే. ‘హ్యాపీ బర్త్ డే’ ఒక పబ్‌లో బర్త్ డే పార్టీ సందర్భంగా చోటు చేసుకునే క్రేజీ సంఘటనల చుట్టూ తిరగే క్రైమ్ కామెడీ మూవీ. ‘మత్తువదలరా’లో సందడి చేసిన అగస్త్య, సత్య ఇందులోనూ కీలక పాత్రలు పోషించారు.
This post was last modified on June 25, 2022 2:18 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…