ఈ రోజు పవన్ కళ్యాణ్ చేయబోయే వినోదయ సితం రీమేక్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యిందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలువుతుందని సోషల్ మీడియాతో పాటు కొన్ని ఛానల్స్ లో జోరుగా ప్రచారం జరిగింది. కట్ చేస్తే అలాంటిదేమీ జరగలేదట. పవన్ హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ దీన్ని ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసే ఆలోచనలో లేనట్టుగా తెలిసింది. అసలే హరిహరవీరమల్లు టెన్షన్ ఎక్కువవుతోంది. ఈ ప్రాజెక్టుని కొనసాగిస్తారా లేదా అనే స్థాయిలో ఏదేదో ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ నేపథ్యంలో అంత అర్జెంట్ గా ఈ కొత్త రీమేక్ ని మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఇందులో కీలక పాత్ర పోషించాల్సిన సాయి తేజ్ ఇంకొంచెం ఒళ్ళు చేయాలట. దానికి తోడు పవన్ కి ఈ మూవీలో ఏ హెయిర్ స్టయిల్ ఫిక్స్ చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. ప్రస్తుతానికి తను వీరమల్లు జుత్తుతోనే ఉన్నాడు. దాంతోనే ఈవెంట్లకు యాత్రలకు ఓపెనింగ్స్ కి వెళ్తున్నాడు. ఒకవేళ అదే కొనసాగిస్తే తన సినిమాలో హీరో గెటప్ కున్న ప్రత్యేకత తగ్గిపోతుందని హరిహరవీరమల్లు దర్శకుడు క్రిష్ అభిప్రాయపడుతున్నారట.
సో వినోదయ సితం రీమేక్ కి ఇంకొంత టైం పట్టొచ్చు. ఫ్యాన్స్ మాత్రం పిచ్చ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ ఏదో అద్భుతం చేస్తాడని భవదీయుడు భగత్ సింగ్ మీద బోలెడు ఆశలు పెట్టుకుంటే అది ఎంతకీ స్టార్ట్ చేయడం లేదు. పోనీ ప్యాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ తెస్తుందని భావించిన హరిహరవీరమల్లు రోజుకో గాసిప్ ని బయటికి వదులుతోంది. దసరా తర్వాత జనం కోసం రోడ్ల మీద ఉంటానని చెబుతున్న పవన్ కళ్యాణ్ వీలైనంత త్వరగా ఈ అనుమానాలకు చెక్ పెట్టడం బెటర్.
This post was last modified on June 24, 2022 8:07 pm
దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ మేరకు గురువారం యుద్ధం జరుగుతున్న తీరుకు…
ఓ వైపు పాకిస్తాన్ కుట్రపూరిత వ్యూహాలు, మరోవైపు ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద దాడులు… వెరసి నిత్యం భారత…
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా.. ఒకప్పుడు చాలామంది హీరోలు, హీరోయిన్లు ఈ మాట చెప్పేవారు. ఐతే గతంలో సినిమాల్లోకి రావాలంటే…
వైసీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు పడ్డాయి. జైలు-బెయిలు అంటూ.. నాయకులు, అప్పట్లో వైసీపీకి అనుకూలంగా…
ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై ఇప్పుడు కేంద్రం పరిధిలోని ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. ఏపీ మద్యం…
ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్…