ఇవాళ విడుదలైన ఎనిమిది సినిమాల్లో దేనికీ యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాలేదు. అంతో ఇంతో అంచనాలున్న సమ్మతమే సోసో రిపోర్ట్స్ తెచ్చుకోగా చోర్ బజార్ అంతకన్నా తక్కువ రెస్పాన్స్ రాబట్టుకుంది. ఇక మిగిలినవాటి గురించి మాట్లాడుకోకపోవడం బెటర్. ఈ నేపథ్యంలో వచ్చే వారం 1న రాబోతున్న పక్కా కమర్షియల్ కు మంచి గ్రౌండ్ దొరికింది. పోటీగా ఏం లేకపోవడం బాగా కలిసొచ్చే అంశం. ఇదే డేట్ కి రావాలనుకున్న రంగ రంగ వైభవంగా డ్రాప్ కావడం, రేస్ లో ఉన్న రాకెట్రీ మీద బజ్ లేకపోవడం ఇవన్నీ ప్లస్సే.
బాక్సాఫీస్ ఆల్రెడీ డల్ గా ఉంది. విక్రమ్ తన కెపాసిటీకి మించి డబుల్ రాబట్టింది. మేజర్ పని సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. అంటే సుందరానికి భారంగా నెట్టుకొస్తున్నాడు. ఎఫ్3 పూర్తి బ్రేక్ ఈవెన్ చేరకపోయినా వీకెండ్స్ లో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతోంది. ఆప్షన్లు లేకపోవడం వల్లే చాలా సెంటర్స్ లో 777 ఛార్లీని తీసేయలేదు. ఇదే నయమనే ఫీలింగ్ లో జనాలు వెళ్తున్నారు. సో జూలై 1 నాటికి మాస్ ఆడియన్స్ కి పక్కా కమర్షియల్ ఒకటే ఆప్షన్ గా నిలుస్తుంది. సో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బాగానే ఉందనే టాక్ వచ్చినా చాలు పక్కా కమర్షియల్ పాసైపోతుంది. ప్రతి రోజు పండగేతో పెద్ద హిట్టు కొట్టి మంచి రోజులు వచ్చాయితో షాక్ తిన్న దర్శకుడు మారుతీకి ఇది హిట్ కావడం చాలా అవసరం. నెక్స్ట్ హ్యాండిల్ చేయబోయేది ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని. సో దానికి తగిన అర్హుడినే అని ఋజువు చేసుకునేందుకు పక్కా కమర్షియల్ రిజల్ట్ ఉపయోగపడుతుంది. ట్రైలర్ చూస్తే రెగ్యులర్ స్టైల్ లో ఉన్నప్పటికీ పైసా వసూల్ బాపతులాగే కనిపిస్తోంది. మరి ఈ ఛాన్స్ వాడుకుంటే గోపీచంద్ కో హిట్టు దక్కినట్టే.
This post was last modified on June 24, 2022 7:48 pm
అతడు.. తెలుగు ప్రేక్షకులు అత్యంత మెచ్చిన చిత్రాల్లో ఇది ముందు వరసలోఉంటుందనడంలో సందేహం లేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్…
చట్టసభల్లో ప్రజా ప్రతినిధుల వ్యవహార తీరుకు సంబంధించి చట్టాల్లోని నియమ నిబంధనలు పెద్దగా పనిచేయడం లేదు. చట్టాలను పక్కనపెట్టేస్తున్న కొందరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం బస్సు డ్రైవర్ గా అవతారం…
బాహుబలి తర్వాత సీక్వెల్ ట్రెండ్ అనేది ఎంత పాపులరయ్యిందో చూస్తున్నాం. కెజిఎఫ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లు దానికి మరింత…
క్రికెట్ పండగ వస్తోంది. మార్చి 22 నుంచి మే 25 దాకా రెండు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్…
ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడిపోవడం ఇటీవల చర్చనీయాంశం అయిన సంగతి…