అవును థాంక్ యు విడుదల తేదీ మారింది. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ కు ముందు ప్రకటించిన డేట్ జూలై 8. కానీ ఆ తేదీకి రిలీజ్ చేయడం కష్టమేనని అర్థమయ్యింది. దీంతో జూలై 22కి వాయిదా వేసి అఫీషియల్ గా ప్రకటించారు. ఇంకో రెండు వారాల్లో చైతుని బిగ్ స్క్రీన్ మీద చూడొచ్చని ఆశించిన అభిమానులకు ఇది నిరాశ కలిగించేదే అయినా తక్కువ గ్యాప్ కాబట్టి ప్రాబ్లమ్ లేదు.
కారణాలు బయటికి చెప్పలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కు తగినంత సమయం లేకపోవడం ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఒకవేళ పాత తేదీనే ఫిక్స్ అయితే చేతిలో ఉన్నది రెండు వారాలు మాత్రమే. ఆలోగా అన్నీ పూర్తి చేయాలి.
మిగిలిన లిరికల్ వీడియోలు, ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ గట్రా చాలా వర్క్ ఉంటుంది. ఇంత తక్కువ టైంలో ఫినిష్ చేయడం సులభం కాదు. దూత వెబ్ సిరీస్ షూట్ లో ఉన్న చైతు దీని కోసమే ఆల్రెడీ తన కాల్ షీట్స్ ని ఖాళీగా ఉంచుకున్నా లాభం లేకపోయింది
నిజానికి థాంక్ యుకు ఈ టైంకల్లా రావాల్సిన బజ్ ఇంకా చేరలేదు. ఫ్యాన్స్ సంగతేమో కానీ సామాన్య ప్రేక్షకుల్లో ఇదింకా బలంగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. మజిలీ, లవ్ స్టోరీ, బంగార్రాజు ప్రీ రిలీజ్ టైంలో ఈ సీన్ లేదు. పాటలు హిట్టవ్వడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి వీటి మీద ఆసక్తి ఉండేది.
కానీ మనం కాంబినేషన్ రిపీట్ అవుతున్నా సరే థాంక్ యుకి ఆ హడావిడి కనిపించడం లేదు. పైగా దిల్ రాజు నిర్మాణం, తమన్ సంగీతం, రాశిఖన్నా హీరోయిన్ లాంటి హంగులు ఉన్నప్పుడు ఇంకా స్పీడ్ పెంచాలి మరి. దానికి కనీసం నెల రోజులు కావాలి. అందుకే మంచి డెసిషన్ తీసుకున్నారు.
This post was last modified on June 24, 2022 5:56 pm
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…