టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ ఫెస్టివల్ కి సినిమా రిలీజ్ చేస్తే మినిమం కలెక్షన్స్ అవలీలగా రాబట్టొచ్చు. అందుకే ఏడాది ముందు నుండే ఈ సంక్రాంతి రేస్ లో తమ సినిమాలను లైన్లో పెడుతుంటారు దర్శక నిర్మాతలు. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ ని సంక్రాంతి పోటీ లో దింపారు. తాజాగా వైష్ణవ్ తేజ్ మాస్ సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు పొంగల్ రేస్ లోకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చాడు మెగా స్టార్. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మాస్ సినిమా ‘వాల్తేరు వీరయ్య'(వర్కింగ్ టైటిల్) ను 2023 సంక్రాంతికి ఎనౌన్స్ చేశారు.
దీంతో వైష్ణవ్ తేజ్ సినిమా పోస్ట్ పోన్ చేసుకోక తప్పేలా లేదు. ఇంకా మేకర్స్ ప్రకటించలేదు కానీ సినిమా వాయిదా పడటం ఖాయం. ఇక మిగిలింది విజయ్ సినిమా. ఇక్కడి లానే తమిళనాడులో కూడా సంక్రాంతి సీజన్ కి మంచి మార్కెట్ ఉంది. అందుకే ముందే సంక్రాంతి స్లాట్ ని బుక్ చేసుకున్నారు దిల్ రాజు. అయితే ఇప్పుడు చిరుతో విజయ్ పోటీ పడకతప్పదు.
ప్రస్తుతానికయితే చిరు , విజయ్ ఇద్దరూ బడా సినిమాలతో సంక్రాంతి పోటీలో నిలిచారు. మిగతా బడా సినిమాలు కూడా సీన్లోకి వస్తే పోటీ మరింత పెద్దదవుతుంది. బాలయ్య సినిమాను కూడా సంక్రాంతి కి రిలీజ్ చేయాలని ప్లానింగ్ జరుగుతుంది. మరి బాలయ్య రంగంలోకి దిగితే మరోసారి టాలీవుడ్ లో మెగా వర్సెస్ నందమూరి హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతానికయితే మెగాస్టార్ వర్సెస్ దళపతి పోటీ మాత్రమే న్యూస్ లో ఉంది.
This post was last modified on June 24, 2022 3:31 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…