సమ్మతమే హీరో కిరణ్ అబ్బవరం తన సినిమా ప్రమోషన్ కోసం శతవిధాలా కష్టపడుతున్నాడు. ఎడతెరిపి లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తూనే వీలైనంత సోషల్ మీడియాలో తన గురించి మాట్లాడుకునేలా ప్లాన్ చేసుకున్నాడు.
అందులో భాగంగా సమ్మతమే మొదటి రోజు ఫస్ట్ షో టికెట్లు కొనలేని వాళ్ళుంటే తన ఇన్స్ టా కామెంట్స్ లో ఊరు, దగ్గరలో ఉన్న థియేటర్ పేరు పోస్ట్ చేస్తే టికెట్లు పంపిస్తానని హామీ ఇచ్చేశాడు. దీంతో కేవలం కొన్ని గంటల వ్యవధిలో పధ్నాలుగు వేలకు పైగా కామెంట్లు టికెట్లు కావాలని వచ్చి పడ్డాయి.
ఇదేదో బాగుందని అవసరం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ అక్కడ ఊడిపడ్డారు. నిజానికి ఇలా టికెట్ కొనే స్థోమత లేనివాళ్లకు ఫ్రీ ఇస్తానని చెప్పడం కంటే అదేదో తగ్గించే దిశగా ఏదైనా ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ పంపకాలు మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. ఒకవేళ ఇది వైరల్ అయిపోయి లక్షల్లో కామెంట్లు వస్తే అన్నేసి టికెట్లు ఇవ్వడం అంటే మాటలు కాదు. పైగా వాటిని కోఆర్డినేట్ చేసుకుని అభిమానులకు పంపడం అంత ఈజీ కాదు.
పైగా ఫేక్ అకౌంట్గ గోల ఒకటి. వాటిని గుర్తించడం మహా కష్టం. జెన్యూన్ గా చేరేవాళ్లకు అందితే మంచిదే. లేదూ అందరినీ సంతృప్తిపరచకలేకపోతే అదో కొత్త రకమైన ట్రోలింగ్ కి దారి తీస్తుంది.
మొత్తానికి ఏదోలా కిరణ్ అబ్బవరం తన మీద అటెన్షన్ వచ్చేలా చేసుకున్నాడు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉన్నాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం హిట్టు తర్వాత సెబాస్టియన్ డిజాస్టర్ కావడం ప్రభావం చూపించినట్టే ఉంది. సో సమ్మతమే మినిమమ్ గ్యారంటీ తరహా యావరేజ్ టాక్ అయినా తెచ్చుకోవడం చాలా అవసరం
This post was last modified on June 23, 2022 9:59 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…