Movie News

200 కోట్ల నష్టం హీరో పైకి తోసేశారు

ఇటీవలి కాలంలో అతి పెద్ద డిజాస్టర్లు ఏవంటే తెలుగులో ఆచార్య, రాధే శ్యామ్ లు గుర్తొస్తే హిందీలో సామ్రాట్ పృథ్విరాజ్ పేరే చెబుతున్నారు. అవును 300 కోట్ల బడ్జెట్ పెడితే పట్టుమని 80 కోట్లు కూడా దాటలేక గుడ్లు తేలేసింది. ఇప్పుడా నిందని హీరో అక్షయ్ కుమార్ మీదకు తోసేస్తున్నారు నిర్మాతలు దర్శకుడు. ఈ వేషం కోసం అక్షయ్ సిన్సియర్ గా కష్టపడలేదని కనీసం స్వంతంగా మీసం పెంచుకోకుండా పెట్టుడు దాంతో సరిపుచ్చాడని దాంతో స్క్రీన్ మీద ఆ వీరత్వాన్ని ప్రేక్షకులు ఫీల్ కాలేదని విమర్శించారు.

అంతే కాదు దర్శకుడు చంద్ర ప్రకాష్ ద్వివెధి మాట్లాడుతూ అసలు ముందు అనుకున్న హీరో సన్నీ డియోల్ అని తప్పనిసరి పరిస్థితుల్లో అక్షయ్ తో సర్దుకోవాల్సి వచ్చిందని అన్నాడు. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం తీయాల్సిన మూవీని ఇప్పటి ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా మలచడంలో ఫెయిల్ అయ్యామని వాపోయాడు. ఇదంతా డిజాస్టర్ కావడం వల్ల వచ్చిన తంటా. ఒకవేళ హిట్ అయ్యుంటే ఇప్పుడు కామెంట్లు చేస్తున్న వాళ్ళే తమ హీరోని పొగడ్తలతో ముంచెత్తేవారని అక్కి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాపోతున్నారు

అయినా తీసే ముందు ఇవన్నీ ఆలోచించుకోవాలి కానీ ఇప్పుడు లబోదిబోమనడం వల్ల లాభం లేదు. అక్షయ్ కుమార్ సైతం ఈ మధ్య క్వాలిటీని పెద్దగా పట్టించుకోకుండా వేగంగా సినిమాలు తీయడం మీదే దృష్టి పెట్టి వరస దెబ్బలు తింటున్నాడు. ఈ యుద్ధాలు చారిత్రక నేపధ్యాలు నార్త్ జనానికి బోర్ కొడుతున్నాయని బాలీవుడ్ దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. పదే పదే గ్రాండియర్ల పేరుతో అవే ప్రయత్నాలు చేస్తూ నష్టాలు తెచ్చుకుంటున్నారు. అంతా అయ్యాక చల్లగా హీరో వల్లే సినిమా పోయిందని చెప్పడం ఇదేం న్యాయం.

This post was last modified on June 23, 2022 9:58 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

23 minutes ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

2 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

3 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

4 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

4 hours ago